పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

పద్మపురాణము


మధురగానంబు సేయుచుఁ జతుర్విధనృత్యంబులఁ బ్రగల్భలై
సమస్తవిద్యాకళాభిజ్ఞలు నగుచుఁ బితృలాలనంబులం బెరసి
సకలవనంబులం గ్రీడించుచు నొక్కనాఁడు మధురసాస్వాద
మత్తమధుకరమంజురవాకీర్ణం బగు మధుమాసంబునఁ బుష్పాప
చయంబులు సేయుచుం జనిచని ముందట.

110


శా.

ఆ రాజాస్యలు గాంచి రయ్యెడ సముద్యల్లోలకల్లోలసం
చారోద్ధూతనవీనఫేనదరహాసస్ఫారమున్ నిర్జరా
హారశ్రీకరవారిపూరముఖరవ్యాపారవిస్తారముం
బారావారగభీర [1]నీరము [2]మహావారమ్ముఁ గాసారమున్.

111


వ.

కని దాని మహిమాతిశయంబులు గొనియాడుచు న య్యిందువదన
లచ్చోటను.

112


తే.

స్ఫటికవైడూర్యసోపానపంక్తులందు
నల్లనల్లన డిగి యీఁదులాడి [3]తనిసి
వెడలి తడుపులు పట్టులు విడిచి కట్టి
రమణు లొప్పిరి మరుని బాణము లనంగ.

113


వ.

అప్పుడు.

114


ఉ.

గౌరి భజించి లీలఁ దెలిగన్నుల రాగము సొంపుచూపఁగా
గారవమార వీణియలు గైకొని యల్లన [4]నాలపించుచు
న్వారక మంజులధ్వనుల వారిజనేత్రలు పాడి రాడుచున్
శారద యేనురూపులగు చందము దోఁప విలాసలీలలన్.

115


వ.

అయ్యవసరంబున.

116
  1. సారము (ము)
  2. మహాపారంబు (తి-హై)
  3. యలసి, తలచుట్లు విడిచి పావడలు గట్టి (హై)
  4. మేళగింపుచున్ (మ)