పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

115


రని చెప్పిన దిలీపుండు తద్వృత్తాంతంబు వినవలతుం జెప్పుమని
యడిగిన వసిష్ఠుం డిట్లనియె.

105


చ.

అనుదిన[1]పద్మసంఖ్యల సదక్షయముఖ్యవిధానయుక్తమై
యనుపమనిర్జరీగణసమంచితగానవిశిష్టమైత్రిలో
చనమకుటేందుఖండరుచిసంచయధౌతసువర్ణహర్మ్యమై
ధనదుని పట్టణం బమరుఁ దద్దయు వస్తుసమృద్ధి నెప్పుడున్.

106

గంధర్వకన్యకల వృత్తాంతము :

వ.

అందుఁ గుబేరుసమ్ముఖంబున ననవరతంబునుం గొలిచియుండు
గంధర్వకన్యకలలోన నగ్రగణ్యలగు వారు సంగతిక కూఁతురు
ప్రమోహినియును, సుశీలపుత్త్రి సునీలయు, స్వరవేది తనయ
సుస్వరయును, చంద్రాకాంతుని నందన సుచారియును, [2]ప్రభా
కరాత్మజ చంద్రికయు నను నేవురు సమానవయోరూపసౌభాగ్య
వినయవిద్యావిశేషంబులుం గలిగి.

107


ఆ.

అంగభవునితూపు లైదును ధాత్రిపై
[3]యంగకములు దాల్చి యలరినట్లు
మెలఁగి యాడుచున్న మెఱుఁగుఁదీఁగెల భాతిఁ
బెంపుమైఁ జరింతు రింపు లొలయ.

108


ఆ.

చంపకములు దుఱిమి సౌవర్ణభూషణ
స్తోమ మమరఁ దాల్చి [4]సొన్నచాయ
పట్టు నొనరఁ గట్టి పద్మాక్షు లొప్పిరి
పసిఁడి జేసినట్టి ప్రతిమ లనఁగ.

109


వ.

ఇ ట్లవ్వనితలకు మవ్వంబులగు జవ్వనంబులు నివ్వటిల్ల స్వరగ్రామ
తానమానమూర్ఛావిశేషంబుల వీణావాదననైపుణంబు మెఱయ

  1. శంఖపద్మముల నక్షయముఖ్యనిధానయుక్తమై (తి-హై)
  2. సుప్రభాత్మజ (తి-హై)
  3. యంగములను దాల్చి యమరినట్లు (హై)
  4. హేమఛాయ (హై)