పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

పద్మపురాణము


వ.

అనిన విని కాంచనమాలిని గంధర్వకన్యకలకుం దనమాఘమాస
స్నానఫలంబు నిచ్చి వారును దానును గైలాసంబున కరిగి సుఖం
బుండె; నిట్టిది [1]మాఘస్నానమహాత్మ్యం బని దత్తాత్రేయుండు
కార్తవీర్యునకుం జెప్పెనని చెప్పుటయు విని దిలీపభూపాలుం డట
మీఁది వృత్తాంతం బాన తిమ్మని యడిగిన.

103


సీ.

మనుజేంద్ర! విను మాఘమాసమజ్జనఫల
        మరయ నేరికిఁ జెప్ప నలవిగాదు;
సర్వయజ్ఞములకు సర్వధర్మములకు
        సర్వదానములకు సాటివచ్చు;
నొకనాఁడు సుస్నాన మొనరించు మానవుం
        డుభయకులంబుల నుద్ధరించు;
దివిజాలయము నొందు భువి నెట్టిపాపియు
        [2]జన్మాంతరముల దోషము లణంచి;


తే.

యరయ నధ్యాత్మవిదులైన యట్టివారు
ఘనులు ప్రాపింత్రు మాఘావగాహనమును
బూర్వసుకృతంబు కతమునఁ బొందుగాక!
యితరమనుజుల కీఫలం బేల కలుగు?

104


వ.

మఱియు మాఘమాసంబున సుస్నాతులై యథాశక్తి నెవ్వియే
నియు దానంబు లిడవలయు. నన్నదానం బిడినయతం డమృ
తాశియై దివ్యవర్షసహస్రంబులు దేవలోకంబున వసియించు. హేమ
దానం బిడినయతం డింద్రు డగ్గఱియుండు. వస్త్రదీపాదు లిచ్చిన
వాఁడు సూర్యసన్నిధి నుండు. నందు సూర్యోదయవేళ విష్ణు
నారాధించినవారు విష్ణులోకంబునం బొందుదురు. [3]కావున దొల్లి
గంధర్వకన్యలు మునిశాపంబున నత్యంతదుఃఖంబునం బొంది
రోమశానుజ్ఞ వడసి మాఘస్నానంబు సేసి పుణ్యతనువులు ప్రాపించి

  1. మాఘమాహాత్మ్యం బని (ము)
  2. జన్మాంతరాఘముల్ సమయజేసి (హై)
  3. వారల చరిత్రంబు పలుక నశక్యంబు మరియు దొల్లి (హై)