పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

113


క.

నీ కారణమున నిపు డీ
భీకరరూపంబు విడిచి పెంపగు నాక
శ్రీ కర్హుఁడనై నెగడితి
నాకుం గర్తవ్య మెద్ది నళినదళాక్షీ !

96


వ.

అనిన నద్దివ్యపురుషునకుఁ గాంచనమాలిని యిట్లనియె.

97


క.

ధర్మము సేయుము; సతతము
నిర్మల[1]మతి నుండు; హింస [2]నినుపకు మదిలో;
ధార్మికులజోక విడువకు;
దుర్మదమున నన్యజనుల దూషింపకుమీ!

98


వ.

కామక్రోధాదులం దగులక శరీరం బస్థిరంబుగాఁ దలంచి వైరా
గ్యంబు గలిగి భూతహితంబు సేయుచు నత్యంతపుణ్యలోక
సౌఖ్యంబు లనుభవింపుమనిన నతఁడు కాంచనమాలిని కిట్లనియె.

99


శా.

ఆచంద్రార్కముగా నిరంతరము నీ వారూఢిఁ దారాద్రిపై
నాచంద్రార్ధకిరీటుసన్నిధిఁ బ్రియంబారంగఁ గ్రీడింపు గౌ
రీచిత్తప్రియకారివర్తన మతిప్రేమంబుతో సంతత
ప్రాచుర్యంబగుఁ గాత నీకు విలసద్రాజీవపత్రేక్షణా!

100


వ.

అని యాశీర్వదించుచు నతండు దివ్యవిమానారూఢుండై [3]కాంచన
మాలిని వీడ్కొని దివిజలోకంబునకుం జనియె; నట్లు బ్రహ్మరాక్ష
సుండు ముక్తుండై దివంబునకుం జనుటం జూచి యవ్వనంబున
నున్న దేవకన్యకలు కాంచనమాలిని కిట్లనిరి.

101


క.

నీకారణమున విప్రుఁడు
నాకంబున కరిగె నడవి నవయుచు దుఃఖ
వ్యాకులులమైన మమ్మును
జేకొని రక్షింపవలదె సింధురగమనా!

102
  1. గతి (మ-తి-హై)
  2. సేయకు (తి)
  3. వేల్పులు గురియు పువ్వులవానల దడియుచు కాంచనమాలిని (హై)