పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

111


వ.

అట్లు గావున నచ్చటం జేసిన దురితంబుల నెరియుచున్న నాకు.

89


సీ.

విను! రెండుజన్మంబులను గృధ్రమై పుట్టి
         ముమ్మారు పులిగర్భమున జనించి,
పెను[1]బామనై రెండుజననంబు లొందితి;
         బొరి నులూకంబనై పుట్టి, యొక్క
మాటు వర్తించితి, మఱి శునకంబనై
         పుట్టి, యాపాపంబు చుట్టుముట్టఁ
బదియగు జన్మంబు బ్రహ్మరాక్షసుఁడనై
        యీరూపమునఁ బుట్టి, యిచటనుండి


ఆ.

సోలి డెబ్బదేనువేలేండ్లు[2]కొలెఁ బాప
మనుభవించుచుండి యవధిగాన
నేమి చేయువాఁడ నెయ్యది [3]తెప్ప నా
కిట్టి పాపవార్ధి నెట్లు గడతు.

90


వ.

అదియునుం గాక యీక్రూరజన్మంబునం బుట్టి మఱియునుం
బాపంబు సేయుచుండుదు; నిప్పుడు నాచేత మృతులైనవారి
నెన్నం గొలఁది గాదు. నాకు వెఱచి యిచ్చట యోజనత్రయంబు
నిర్జనంబై యున్నయది; నేఁడు భవదీయదర్శనంబునం జేసి
నాచిత్తంబు దోషంబులకుఁ [4]దొడరకున్నది; యిట్టి నాకు దురిత
విముక్తి ప్రసాదించి పుణ్యలోకంబు గలుగు నుపాయంబు సెప్పి
యుద్ధరింపు మని నమస్కరించినం గరుణాయత్తచిత్త యై య
క్కాంచనమాలిని యి ట్లనియె.

91
  1. బాము (తి-హై)
  2. గులె (ము)
  3. తెరువు (ము)
  4. రోయుచున్నది (ము)