పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

109


వ.

ఇవ్విధంబున నంతకంతకుఁ దా నతిశయించి సకలజీవనిర్బంధ
కారణంబై హేమంతాగమనంబు ప్రవర్తిల్లుచుండ నట్టిసమయం
బున.

78


ఉ.

ముక్కున నీరుజాఱ [1]వలిమో మెగయింపఁగ మేను చేతులం
జిక్కఁగఁ గప్పుకొంచు దలచీరఁ దలంపక గాళ్లు నేలపై
ద్రొక్కఁగ రాక కోరగొని తొట్రుపడంగ నరణ్యభూమియం
దొక్కతె నేగితిం జలన మొందక తీర్థము లాడువేడుకన్.

79


వ.

ఇ ట్లరిగి మకరమాఘంబునందు సకలమునిగణసేవితంబైన
గంగాయమునాసంగమంబునం ద్రిదివసావగాహంబునఁ బాతక
హరణంబును సప్తవింశతివాసరస్నానఫలంబునం ద్రిదివసౌఖ్యం
బును సిద్ధించె. తత్ప్రసాదమహిమన యిట్టి సౌభాగ్యంబు జాతి
స్మరత్వంబును సంభవించుటం జేసి ప్రయాగమాహాత్మ్యంబు
దలంచి.

80


క.

ప్రతిమాఘంబుఁ బ్రయాగకు
[2]నతిరక్తిని వచ్చి తీర్థ మాడుదు నిది నా
వ్రత మీతీర్థమహత్త్వం
బతిశయముగ సంస్తుతింతు రమరేంద్రాదుల్.

81


వ.

అని కాంచనమాలిని తనవృత్తాంతంబు చెప్పి బ్రహ్మరక్షస్సున
కిట్లనియె.

82


తే.

ఎట్టి జన్మంబువాఁడ నీ వేమి చేసి
తిట్టి వికృతంపురూపు నీ కేల కలిగె
నిన్నగంబున నేటికి నున్నవాఁడ
వింతయును నాకు వివరించి యెఱుఁగఁ జెపుమ!

83
  1. చలిమో మెగయింపక (తి)
  2. నతివేడుక (తి-హై)