పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

పద్మపురాణము


కూర్మంబు మేను సంకుచితంబు సేయు[1]
        శీతాగమంబగు భీతి కాదె
మొగి పాపఱేఁడు మైముడిఁగి నిద్రించు[2]
        తుహినంబు సోఁకునఁ దూలి కాదె


ఆ.

యనఁగ సకలదిశల నలమిజీవుల నెల్లఁ
గంప మొందఁ జేసి పెంపు మిగిలి
కమలముల హరించి కమలాప్తు గెలువఁగ
నప్పళించు శీత మరుగుదెంచె.

74


వ.

అప్పుడు.

75


సీ.

నేలయంతంతయు నెఱిఁ జంద్రకాంతపు
       ఱాలఁ గట్టించినలీల మెఱసె
నింగియంతంతయుఁ బొంగి దుగ్ధాంభోధి
       నిట్టదొట్టినమాడ్కి దట్టమయ్యె
సకలజీవులమీఁదఁ బ్రకటమై హరికీర్తి
       కలయఁ బర్వినమాడ్కిఁ దెలుపుచూపె
నక్కజంబుగ నెల్లదిక్కుల నొక్కటఁ
       దెరచీర లెత్తిన కరణిఁ దోఁచె


తే.

నగము లెల్లను నీహారనగము లయ్యెఁ
[3]దరువు లెల్లను ఘనసారతరువు లయ్యెఁ
[4]బక్షు లెల్లను రాయంచపదువు లయ్యె
గురుతరంబగు పెనుమంచు గురియు కతన.

76


క.

వలరాజున కాశ్రయమగు
చెలువల పాలిండ్లపంచఁ జేరకయున్నన్
జలిపీఁచ మణఁచఁగూడునె
సొలవక పెనుగిరుల మరువుసొచ్చిన నైనన్.

77
  1. టీ (తి)
  2. టీ (తి)
  3. గజములెల్లను నమరేంద్రగజము లయ్యె (తి)
  4. రేయుబవలును నెడలేక వేయిగతుల (తి)