పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

107


వ.

ఐరావతారూఢుండై సకలదేవగణంబును [1]దిక్పాలురునుం బరి
వేష్టించి కొలిచిరా నమరావతికిం జని సహస్రాక్షుం డక్షీణంబగు
దివిజరాజ్యంబు సేయుచు శచీసమేతుండై యుండె నని మాఘ
స్నానమహత్త్వంబు చెప్పి యవ్విప్రుండు.

69


క.

ఇల [2]నీ యితిహాసోత్తమ
మలవడ విను పుణ్యమతుల కాయువు సిరియుం
గలుగు మహాపాతకమును
దొలఁగును బరదారగమనదోషము లణఁగున్.

70


వ.

అని చెప్పి నీవునుం బ్రయాగ కరిగి మాఘస్నానంబు చేసి సకల
దోషంబులుం బాపికొని పుణ్యలోకసుఖంబు లనుభవింపు మనిన న
మ్మహానుభావు చరణంబులు శిరంబు సోఁక బ్రణమిల్లి యనుజ్ఞఁ
గొని చనుదెంచి.

71


క.

బంధుజనదాసదాసీ
బంధురసంపత్ర్పపూర్ణభవనంబున ని
ర్బంధమును విడిచి సుఖ [3]మను
సంధింపక దృఢవిరక్తి సంపదపేర్మిన్.

72


వ.

కతిపయప్రయాణంబుల నెవ్వరితోడం జెప్పక చనునప్పుడు.

73


సీ.

హరి లచ్చి నే ప్రొద్దు నక్కునఁ దాల్చు[4]
        హేమంత మరుదెంచు టెఱిఁగికాదె
హరుఁడు ఫాలంబుపై ననలంబుఁ దాల్చు [5]
        తఱుచైన చలి కోర్వ వెఱచికాదె

  1. దిక్పాలకులును రంభోర్వశీమేనకాతిలోత్తమలును తను పరివేష్టించి కొలచిరా నమరావతికిం జని సహస్రాక్షుండు సింహాసనంబున శచీసమేతుండై యక్షయసుఖంబు లనుభవింపుచు రాజ్యంబు పాలించెనని ప్రయాగ మాఘస్నాన .... (హై)
  2. యితిహాసంబును, నలరగ (హై)
  3. మనుసంధించుక (ము)
  4. టీ (హై)
  5. టీ (హై)