పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

పద్మపురాణము


తే.

[1]చేయవలవని కార్యంబు సేయు కతన
నిట్టి దురవస్థ ప్రాపించె; నిపుడు నాకు
సొలసి సిగ్గున మీ మోముఁ జూడనోడి
తొలఁగి యిందున్నవాఁడ నే నలఘుచరిత !

63


క.

నా కేడుగడయు మీర వి
వేకింపఁగ నన్య మెఱుఁగ విబుధోత్తమ! నేఁ
డీ కష్టదురితవారిధి
నే కతమునఁ గడతు నానతీవే కరుణన్.

64


వ.

అనిన వాస్తోష్పతికి వాచస్పతి యిట్లనియె.

65


ఆ.

ఏల యింత వగవ! నీ కల్మషంబెల్ల
[2]విడిచిపోవునట్టి [3]విధము గలదు;
తగఁ బ్రయాగ కేగి తజ్జలంబులఁ దోఁగి
తనువు దోషమెల్లఁ దలఁగికొనుము.

66


వ.

అని యా క్షణంబ గంగాయమునాసంగమంబునకుం గొనిపోయి
తజ్జలంబుల మాఘస్నానంబులు మూఁడుదినంబులు సేయించిన
నింద్రుని శరీరంబున మునిశాపదోషంబున నైన కుయోను
లన్నియుఁ దత్ప్రాజాపత్యతీర్థప్రభావంబున నేత్రంబులై వికచ
కమలవనంబు చందంబునం జెలువు మిగిలె నప్పుడు.

67


ఆ.

సురలు పుష్పవృష్టిఁ గురిసిరి; దేవదుం
దుభులమ్రోఁత నభము తుముల మయ్యె;
నప్సరోనికాయ మాడఁగ గంధర్వ
గానములు సెలంగఁ గౌశికుండు.

68
  1. చేయ దగనట్టి (తి)
  2. గడచునట్టి విధము గలదు వినుము (హై)
  3. వెరవు గంటి (తి)