పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

105


ఆ.

[1]నేతిగూన పూని నిచ్చెన యెక్కెడు
నరుని యట్లు [2]రాజ్యభరము పూని
పతికి దుర్యశంబుఁ బాపంబు రాకుండఁ
బదిలపఱచి మంత్రి మెదల వలయు.

58


వ.

అట్లు గావున నీ యట్టి పుణ్యాత్ముల శాసనంబునం దిరుగ నేరమిం
జేసి పాకశాసనున కిట్టి దురవస్థ సంభవించె; నెవ్విధంబుననైనను
నీ యాపదఁ దొలగించి దివిజరాజ్యం బుద్ధరింపవలయు ననినం
బురుహూత పురోహితుండు.

59


క.

ఇంత యననేల నను మీ
[3]కింతకుము న్నింద్రుశాప మీఁగెడి విధమేఁ
జింతించినాఁడ [4]మీ కా
వంతయుఁ జింతిలక రండు [5]హరిహయుకడకున్.

60


చ.

అని తగ నూఱడించి దివిజావలిఁ దోకొని యా సరస్సునం
గనకసరోజనాళమునఁ గానకయుండ నణంగియున్న య
య్యనిమిషనాథుఁ బిల్చి నయమారఁగ సన్నుతు లొప్పఁజేయఁగా
విని సురరాజు వెల్వడియె విశ్రుతమైన సరోజషండమున్.

61


వ.

ఇట్లు వెలువడి లజ్జావనతవదనుండై వాచస్పతికి నమస్కరించి
కృతాంజలియై యిట్లనియె.

62
  1. నెత్తి గడవ బూని (తి-హై)
  2. కార్య (మ)
  3. రింతయు మౌనీంద్రుశాప మీదెడు విధమే (తి)
    కింతకుము న్నింద్రుపాప మెయిదెడు విధమే (మ)
    రింతకము న్నింద్రుశాప మెడలెడు విధమే (తి)
  4. మీ రావంతయు (తి)
  5. వాసవుకడకున్ (మ)