పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

పద్మపురాణము


నయజానవిశారదుండునునై చతుర్దశరాజదోషంబులు పరిహరించి
స్వాయత్తుండైన రాజు భూప్రజారంజనంబును వైరికులభంజనం
బునుం జేయుచు దానధర్మవివేకగుణంబులు దనకు సహాయం
బులుగా దండనీతికుశలుండును పరదారపరాఙ్ముఖుండును నై పక్షా
పక్షంబులు లేక సమచిత్తుండైన రాజు రాజ్యంబు పూజ్యంబగు న
త్తెఱంగు విడిచి.

53


క.

అతిశయరాజ్యమదంబున
మతిఁ గార్యాకార్యచింత మఱచి పరస్త్రీ
రతిఁ జేసి యింద్రుఁ డిహపర
గతులకు [1]నెడఁబాసెఁ దనదు గర్వము పేర్మిన్.

54


వ.

అనిన శచీదేవి యతని కిట్లనియె.

55


క.

నీతియు హితమును ధర్మము
జాతుర్యముఁ గలుగునట్టి సచివుఁడు చెప్పం
బ్రీతి విన నొల్లకుండిన
భూతలనాయకుఁడు [2]తాను బొలియుం బిదపన్.

56


ఆ.

కాలకూటవిషము కడువాఁడిశరమును
గొనిన యతఁడు చచ్చు [3]నెఱను దాఁకి
దుష్టమంత్రి మంత్రదోషంబు దాఁకినఁ
బుడమి జనముఁ బతియుఁ బొలసిపోవు.

57
  1. బెడబాసె (తి-హై)
  2. దాన (తి-హై)
  3. ముద్రితపాఠమున యతిభంగము. నెనరు తి-హై పాఠము కాని యర్థము పొసగదు. ఇది నెనడు-మజ్జ యను మాట కావలెను. అప్పుడు యతితోపాటు అర్థమును సరిపడును. వ్రాత పొరపాటున నెనడుమాట నెనరుగా మారియుండును.