పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

103


క.

సురవిభుఁడు గౌతముని [1]సుం
దరి నన్యాయమునఁ గవిసి తన్మునిచేతం
బరిభవముఁ బొంది యిపు డొక
[2]సరసి నొదిగియున్నవాఁడు చౌర్యగతుండై.

50


ఆ.

నీతిపథము దప్పి నెఱి వేగపడి సేయు
నతఁడు దుఃఖఫలము లనుభవించుఁ
గ్రిందు మీఁ దెఱింగి కృతకార్యుఁ డగువాఁడు
చేయు కార్యమెల్ల సిద్ధిఁ బొందు.

51


సీ.

ఎవ్వఁ డే పని వెంట నే రీతి నేర్పరి
         వాని నియోగింపవలయు [3]నంద;
హితుఁడు విశ్వాసియు మతిమంతుఁడును నగు
         విప్రు నమాత్యుఁ గావింపవలయు;
[4]శక్తిభక్తులు గల్గు సద్భటావలిచేత
         నంగసంరక్ష సేయంగ వలయుఁ;
బ్రజఁ దల్లి పాలించు పగిది భూజనముల
         ననుదినంబును దాన యరయవలయు


తే.

నర్థ మార్జింప నోపెడు నట్టివారి
నాజిశూరుల నీతిజ్ఞులైన వారిఁ
బాపరహితుల పోలిక బంధుజనుల
నరసి ప్రోవంగ వలయుఁ దా నవనివిభుఁడు.

52


వ.

మఱియు సప్తాంగసంపన్నుండును సప్తవ్యసనదూరుండును
చతురుపాయజ్ఞుండును శక్తిత్రయసమేతుండును షడ్గుణపరాయ
ణుండును పరాకృతోపాయ ref>దూరీకృత (ము) </ref>దూరీకరణనిపుణుండును నయా

  1. సతి, నరయగ పాపమున గదిసి యమ్మునిచేతం (హై)
  2. సరసిని యొదిగున్నవాడు శౌర్యరహితుడై (హై)
  3. నండ్రు (ము)
  4. శక్తియుక్తులు (తి-హై)