పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

పద్మపురాణము


క.

అటుగాన నా శరీరం
బిటువలె నుండంగ [1]నచటి కేమని పోదుం
గటకట! యీ కర్మము మి
క్కుటమై యిటు[2]వలెను ముట్టుకొనునే నన్నున్.

46

ఇంద్రుండు శాపగ్రస్తుఁడై లజ్జచే పద్మనాళప్రవేశ మగుట :

వ.

అని యుత్తరాభిముఖుండై పోయి హిమాచలశిఖరంబున శత
యోజనవిస్తీర్ణంబగు నొక్కసరోవరంబుఁ బ్రవేశించి తన్మధ్యం
బునఁ గనకకమలనాళంబు భేదించి చొచ్చి దాని తంతువులలోన
నతిసూక్ష్మరూపంబున నణంగియుండె నంత నిక్కడ.

47


ఆ.

రాజులేని యట్టి రాష్ట్రంబు గావున
నమరలోక మిట్టునట్టువడియె
నపుడు లోకపాలు రాదిగాఁ గల దేవ
గణము నింద్రు వెదకి కానలేక.

48


వ.

పౌలోమిం బురస్కరించుకొని యందఱు బృహస్పతి పాలికిం
[3]జని యమ్మహాత్మునిం గని ప్రణమిల్లిన వారల దీవించి దగిన
సంభావనంబులు చేసి శచీదేవిని గారవించి యుచితాసనంబు లిడి
వచ్చిన కార్యం బెఱింగింపుం డనిన వారు దేవవిభుండు [4]లేమి
నైన సురలోకోపద్రవం బెఱింగించి పాకశాసనుండు చనుదెంచు
నుపాయం బానతిమ్మనిన వాచస్పతి యిట్లనియె.

49
  1. నెచటి (హై)
  2. చుట్టుముట్టుకొనునే తన్నున్ (హై), చుట్టుముట్టుకొనియెను నన్నున్ (తి)
  3. జనిన న మ్మహాత్ముండు వారలం (ము)
  4. వెలియైన (హై)