పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

101


న్నాతికి శాపం బిచ్చి కమండలూదకంబులు కరతలంబునం బట్టి
పురందరు నుద్దేశించి.

39


ఉ.

మిన్నక వచ్చి వచ్చి పులిమీసల నుయ్యల లూఁగినట్లు దా
న న్నొకచీరికిం గొనక నా యిలు సొచ్చి భయంబులేక ద
ర్పోన్నతి నిట్లు సేయు [1]కలుషోగ్రమనస్కుని మేను రోఁతగాఁ
గ్రన్ననఁ బెక్కుయోనులుగఁ గావుతమంచు శపించె నుగ్రతన్.

40


వ.

ఇ ట్లతిదారుణంబైన శాపం బిచ్చుటయుఁ బాకశాసను శరీరంబు
[2](నాక్రమించి) యోనిస్వరూపంబులగు దుర్వ్రణసహస్రంబు
లుద్భవించి తత్క్షణంబ.

41


క.

చీమును నెత్తురు దొరఁగఁగఁ
బై ముసరెడు మక్షికాళి బహుగతిఁ దొలువం
గా మహిమఁ దొఱఁగె నింద్రుఁడు
సామాన్యమె యమ్మహాత్ముశాపము తరుణీ!

42


వ.

అ ట్లతిజుగుప్సితం బగు తనశరీరంబుఁ జూచుకొని లజ్జావనత
వదనుండై మహేంద్రుం డాత్మగతంబున.

43


తే. గీ.

తొల్లి చేసిన సుకృతంబు లెల్లఁ బొలియు
శ్రీయు నాయువు నశియించుఁ జేటువచ్చుఁ
గానఁ బరదార సుఖవాంఛఁ బూననొల్ల
రాత్మసుఖులైన పుణ్యాత్ము లనుదినంబు.

44


ఆ. వె.

ఇంత యెఱిఁగి యెఱిఁగి యే మీఁదు గానక
యింత తెచ్చుకొంటి నంత చేసి
యది యలంఘనీయ మమ్మహా[3]ముని శాప
మనుభవింప వలయు హరునకైన.

45
  1. గలుషాగ్ర (ము-యతిభంగము)
  2. (మ-తి-హై)
  3. త్ముని (ము)