పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

99


ఆ.

నడవి నాకు నలము నశనంబుగా సల్పి
నడుమ నార గట్టి నవయుచున్న
[1]పాఱు నాతియింటిపంచ ప్రాప్తము చేసెఁ
గాముచేత బ్రతుకఁ గలరె యొరులు.

28


వ.

అని యఖిలభూతనివహంబు [2]లాక్రోశించుచు నుండ నప్పురం
దరుండు.

29


ఉ.

ఎప్పుడు గాని వేగదొకొ యీ నిసి నేఁడును నిమ్మునీశ్వరుం
డెప్పుడు పోవునో వెడలి యీ నది దిక్కున కీ మృగాక్షి నే
నెప్పుడు కౌఁగిలించి సుఖియింతునొకో యని ప్రొద్దుచూచుచున్
నిప్పులఁ బడ్డ చందమున నిర్జరనాయకుఁ డుండె నంతటన్.

30


క.

తొలికోడి కూయ శిష్యులఁ
దెలుపుచు గౌతముఁడు నదికి దిగ్గన నరిగెన్
బలభేదియుఁ గొనచీఁకటిఁ
బొలఁతుక యిలు సొచ్చి మేను పుణుకఁగ నదియున్.

31


క.

ఇది యెవ్వరన్న సతి నో
రదుముచు మైఁ గౌఁగిలించి యల్లన చెవిలో
రొదసేయకు [3]మని యింద్రుఁడ
వదలక నినుఁ జూచి కూడ వచ్చితిఁ దరుణీ!

32


క.

పంచశరుబాణసంహతిఁ
బంచత్వము నొందలేక భామిని యిదె నీ
పంచకు వచ్చితి దీనిఁ బ్ర
పంచము గానీక మేలు వడయుట యరుదే.

33
  1. బడుగు నాలియింటి (హై), బడుగువాని యింటి (మ-తి)
  2. లాలోకింపుచుండ (హై)
  3. మే నింద్రుడ (తి), నే నింద్రుడ (హై)