పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

97


క.

కలకంఠి మగఁడు శివుతో
సొలయక యఱకాలఁ గన్ను చూపినవాఁ డీ
పొలఁతుక కెడయాడుట [1]దాఁ
బులితోఁ [2]జెరలాట మాడఁబోవుటగాదే.

17


ఉ.

ఇచ్చటనుండ నన్నుఁ గని యీ ముని యేమని శాప మిచ్చునో
వచ్చిన చేటు వచ్చెనని వామవిలోచనఁ బట్టుకొంటి నే
నిచ్చ యెఱుంగ కేమనునొ యీ పని గాదని యూరకుంటినేఁ
బచ్చనివింటిజోదు నను బాణపరంపర నొంపుఁ దెంపునన్.

18


ఉ.

చూడదు కన్నువిచ్చి మఱి చూచిన నవ్వదు నవ్వి మాఱుమా
టాడదు మాట చొప్పడిన నందెడు డెందముగాదు దీనిపై
వేడుక యేల పుట్టెఁ గడువేఁదుఱు గొల్పె మరుండు నన్ను నీ
చేడియ నెన్నిచందములఁ జెందక యాఱఁడిఁ [3]బోవవచ్చునే!

19


క.

రాత్రి యిలు సొచ్చి పట్టఁగ
[4]గాత్రస్పర్శమున లోనుగాకుండునె స
త్పాత్రాపాత్రము లంబుజ
నేత్రలు దలఁపుదురె జారునిం బొడఁ గన్నన్.

20


ఆ.

అనుచు వెచ్చనూర్చు నయ్యింతి [5]లోఁ బట్టు
మతము లుగ్గడించు కుతిలకుడుచు
మరలిపోవఁ [6]జూచు విరహాగ్నిశిఖలచేఁ
దిరుగు మరులుగొనుచు దివిజవిభుఁడు.

21
  1. యా (హై)
  2. జెరలాడి బ్రతికిపోవుట (తి-ము)
  3. జావవచ్చునే (ము)
  4. గాత్రస్పర్శనము (ము)
  5. లోబడు (హై)
  6. జూచి (ము)