పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-తృతీయాశ్వాసము

95


ఆ.

వినుము బ్రహ్మలోకమున నుండి నారదుం
డంతరిక్షవీథి నరిగి యరిగి
గౌతమాశ్రమమునఁ గర మొప్పుచున్న యా
సతి నహల్యఁ గాంచె సమ్మదమున.

6


వ.

అయ్యింతిలావణ్యంబున కచ్చెరు వంది యింద్రుసభకుం జని
యతనిచేతం బూజితుండై యమ్మునీంద్రుండు సురేంద్రున కిట్ల
నియె.

7


క.

గౌతముని భార్య త్రిజగ
త్ఖ్యాత యహల్యాఖ్య వికచకమలానన యా
నాతి కెనవచ్చు సుదతుల
నేతరమునఁ జూచి వినియు నెఱుఁగ సురేంద్రా !

8


ఉ.

చన్నుల[1]యొప్పిదంబుఁ గటిచక్రపుపెంపును మోవికెంపుఁ గ్రేఁ
గన్నులసోయగంబు నలకంబులకప్పును మేనికాంతియుం
దిన్ననికౌను నెమ్మొగముతీరును జూడ్కికి విందుసేయఁగా
నన్నలినాక్షి యొప్పు విషమాయుధు మోహనశక్తియో యనన్.

9


వ.

అని చెప్పి దేవముని నిజేచ్భం జనుటయు ననిమిషపతియును
మనంబునం [2]గోరికలు కొనలునిగుడ మనసిజాయత్తచిత్తుండై య
త్తన్విం జూచువేడ్క నాప్రొద్ద [3](కదలి) గౌతమ మహామునీంద్రు
నాశ్రమంబునకుం జని వియత్పథంబున నిలిచి కలయం గనుం
గొను నప్పు డప్పర్ణశాలాంగణంబున.

10

ఇంద్రుఁ డహల్యం బొందఁ గోరుట :

తే.

పుష్పలత నెండినాకులు పొదివినట్లు
బెరసి కర్కశవల్కలాంబరము గట్టి
క్రొత్తగా గర్లు గట్టినఁ గొమరు మిగులు
నంగభవబాణతుల్య నహల్యఁ గనియె.

11
  1. క్రొవ్విదంబు (ము)
  2. వినుకల (తి-హై)
  3. (తి-హై)