పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

93


మాలిని.

వివిధ[1]విభవరమ్యా! విశ్రుతాలాపసౌమ్యా!
ధవళవిపులకీర్తీ! దానధర్మైకవర్తీ!
యవిరళశుభగాత్రా! యౌబళామాత్యపుత్త్రా!
[2]కవినుతగుణసాంద్రా! కందనామాత్యచంద్రా!

249


గద్య.

ఇది శ్రీ నరసింహవరప్రసాదలబ్ధకవితావిలాస భారద్వాజగోత్ర
పవిత్రాయ్యలామాత్యపుత్త్ర సరసగుణధుర్య సింగనార్యప్రణీతం
బైన పద్మపురాణోత్తరఖండంబునందు సుందోపసుందోపాఖ్యా
నంబును హేమకుండలచరిత్రంబును నతని తనయులగు శ్రీకుం
డల వికుండలులు యమసదనంబునకుం జనుటయు నందు వికుం
డలుండు యమదూతవలన నిఖిలధర్మాధర్మంబులు విని తనపూర్వ
జన్మసుకృతఫలం బిచ్చి నరకంబందున్న శ్రీకుండలు నుద్ధరించు
టయు కాంచనమాలినిచరిత్రంబును నన్నది ద్వితీయాశ్వాసము.


  1. విబుధ (ము), భవన (మ-హై)
  2. కవితసుగుణసాంద్రా (ము), కవిజనమత (హై)