పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

పద్మపురాణము


క.

మానుగ నుపవాసవ్రత
దానంబులకంటెఁ బుణ్యతమమగు యమునా
పానీయంబున మాఘ
స్నానం బొనరింపు భక్తిసంపద వెలయన్.

243


వ.

అట్లేని నీకు [1]ననేక జన్మసంచయదురితహరణంబైన పుణ్య
లోకంబులు సిద్ధించు. నే పుణ్యంబులునుం దీర్థస్నానంబునం బోల
వని మహామునులు సెప్పుదు రట్లు గావునం బ్రాజాపత్యతీర్థంబున
కేగి యచ్చట నవగాహంబు సేయుమని యవ్విప్రుండా తీర్థం
బునఁ దొల్లి కృతస్నానుండై యింద్రుండు గౌతముని శాపంబున
నైన దేహకల్మషంబు వాపుకొనియె ననిన విని యే నిట్లంటి.

244


ఆ.

గౌతముండు దొల్లి [2]కాకచేఁ గోపించి
యేల శాప మిచ్చె యింద్రుఁ డట్టి
దురితపంక మెట్లు దొలఁగించుకొనియె నా
కవ్విధంబుఁ దెలియ నానతిమ్ము.

245


వ.

అని యిట్లు కార్తవీర్యునకు దత్తాత్రేయుండు చెప్పెనని చెప్పిన
విని యటమీఁది కథ యెట్ల య్యెనని యడిగిన.

246


వనమయూరము.

భూరిగుణసార! బుధపోషణ! మనోజా
కార! కవితాసరసగానసువినోదా!
తారకపటీరహిమధామనిభకీర్తి
స్ఫార! సురభూరుహ[3]విశాలనిజహస్తా!

247


క.

శ్రీరామాధిపచరణాం
భోరుహమదభృంగ! శిష్టపోషణ! సుజనా
ధార! మృదుమధురభాషణ!
నారీమదనావతార! నగపతిధీరా!

248
  1. నా జన్మ (ము)
  2. కౌశికు (ము)
  3. విభాసి (మ-తి-హై)