పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

91


యంబరాభరణమాల్యానులేపనములు
        [1]విడిచిపెట్టిన యట్ల తొడుగనేర్చి
తనకు లేమిని నొడ్లధనము పెంపును జూచి
        విధిమీఁద మెటికలు విఱిచి విఱిచి


తే.

మోహలోభాదు లిరువంక [2]మొగిని పార
నిష్ఠురోక్తికి నిలువంగ నీడ యగుచుఁ
గష్టతరమగు ముదిమిచేఁ [3]గ్రాఁగు మనుచు
నన్ను బోధింపఁ దగునయ్య యన్న నతఁడు.

239


క.

ఇది యట్టిద మానవులకు
ముదియుట సౌఖ్యంబులెల్ల ముద్రించుట నీ
హృదయంబున వైరాగ్యము
[4]గదురుట మోక్షంపుత్రోవఁ గాంచుట తన్వీ!

240


క.

ఆశ్చర్యం బయ్యెడి నీ
పశ్చాత్తాపంబుఁ జూచి భామిని యిఁక నీ
దుశ్చరితములకుఁ జొరకుము
నిశ్చయముగ మోక్షపదము నీ కెఱిఁగింతున్.

241


వ.

అని పెద్దయుం బ్రొద్దు [5]చింతించి యిట్లనియె.

242
  1. విడిభోగ మొల్లక విడిచిపెట్టి (హై)
  2. మునిగిపార (తి-హై)
  3. కాటుపడిన (హై)
  4. కదియుట మోక్షంబు మిగుల (హై)
  5. విచారించి యీ మానినికి వై రాగ్యంబు నిశ్చయంబు. ఇది కపటహృదయ కాదు. సులభోపాయంబున పుణ్యలోకంబు
    వడయు గాక యని వితర్కించి విశ్వాసంబున వినుమని ఇట్లనియె. (హై) అధికపాఠము.