పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

పద్మపురాణము


వ.

ఇవ్విచారంబు లుడిగి నీ మందిరంబునకుం జని సుఖంబుండు
మనిన విని య వ్విప్రున కిట్లంటి.

233


ఆ.

మాంసరక్తపూయమస్తిష్కకీకస
స్నాయుబద్ధమైన కాయమందు
నైన సౌఖ్యమెంత యాయువు నా నంత
కష్టతరము చూడ శిష్టచరిత!

234


వ.

కలిగి భోగింపవలదా యని యంటేని.

235


అ.

పువ్వుపూఁత యాకుపోఁక చీరలు సొమ్ము
లొనరఁ బూనుటెల్ల నొకనికొఱకుఁ
గాని యాత్మసుఖము నూని భోగింప లే
దరయఁ బడసి కుడుచు నంగనలకు.

236


వ.

అదియునుం గాక నాకు భోగేచ్ఛ విడుచునట్టి సకలసౌఖ్యార్ణవబడ
బానలంబగు ముదిమి తోతెంచుచున్న యది; యిత్తఱిం బరలోక
చింతయ పురుషార్థంబు గాని సుఖంబుల కాసపడుట కర్జంబుగా దది
యెట్లంటేని.[1]

237


ఉ.

చెక్కులు జాఱెఁ గన్నుఁగవ చెన్ను దొఱంగె మొగంబునందు స్రు
క్కెక్కె శిరంబునందు [2]నరచేరెడి పక్వము దప్పెఁ గ్రీడలన్
మక్కువ వీడుకొల్పి తగుమాటల తేటలఁ బల్లవావలిం
జొక్కులఁ బెట్టుచున్న ననుఁ జూచిన నెవ్వరు నవ్వకుందురే.

238


సీ.

వెనుకవారల నేర్పు దన కా టెఱుంగక
        [3]వలనుచేతలఁ జేయ వగచి వగచి
తగిలి పాయఁగలేని మగవారు తనదిక్కు
        పలుకకుండిన క్రిందుపడుట కోర్చి

  1. నీరు బుగ్గలం జూచి నవమౌక్తికంబులని యాసపడు చందంబు నదియుం గాక (హై) అధికపాఠము.
  2. నర పేర్పడి (మ-హై)
  3. వయసు చేతలు (మ)