పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

87


క.

వెండియు బసిఁడియుఁ దడఁబడు
చుండఁగ నా యిల్లు లచ్చి [1]కునుకువ యయ్యెన్
[2]వెండిరువది యేనేఁడును
నిండెడు ప్రాయంబు నాకు నెలకొనునంతన్.

217


వ.

ఇట్టి దివసంబులం దొక్కనాఁడు ప్రక్కకు విటపుంగవు రాక వార్చి
ప్రొద్దు [3]వోయి నంతకు నే నొక్కతిన శయ్యాతలంబున నుండి
యతండు రామిం జిత్తం బుత్తలపడ నత్యంతవిషాదంబు నొంది
యిట్లని వితర్కించితి.

218


క.

ఏ ననఁగ నెవ్వ రాతఁడు
దా ననఁగా నెవ్వఁ డింత తాపము నొందం
గానేల వచ్చె నీయెడ
నే నేటికి నిద్రలేక యెరిసెద నకటా !

219


ఆ.

ఏల మరులుకొంటి నే నింతకాలంబు
నేమి ద్రవ్వుకొంటి నింతచేసి
పాతకములకెల్లఁ బట్టుఁగొమ్మగునట్టి
కష్టజన్మ మేల కలిగె నాకు.

220


ఉ.

అక్కట యింతకాలమును నాఱడి పాపము గట్టుకొంటి నా
కెక్కడి [4]తల్లి యీ సుహృదు లెక్కడివారలొ యీ విటాధముం
డెక్కడి కేగె నేమి ధన మేటికి నీ యవినీతవృత్తముం
దక్కక యాచరించితి వృథా యముబారికి నగ్గమైతినే.

221
  1. కుఱవును నయ్యెన్ (ము)
  2. రెండిరువది (మ-తి-హై)
  3. వోయె నంతకు నే నొక్కతెనె (ము)
  4. తల్లి పంపు నిక నెక్కడి భోగము లీ విటాధముం (మ)