పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

పద్మపురాణము


నద్దేవి మన్నించి యనవరతంబును
       సఖిఁగాఁగ ననుఁజూడ సంతసమును
నుండుదు నే నిప్పుడొగి ప్రయాగస్నాన
       మొనరించి పోయెద వినుము నామ


తే.

మవనిఁ గాంచనమాలిని యండ్రు నన్ను
నెల్లదిక్కుల విహరింతు నిచ్చఁ దగిలి
యనినఁ బ్రేమంబుఁ గృపయును నగ్గలింప
రమణిఁ గనుఁగొని యిట్లనె రాక్షసుండు.

199


తే.

ఇట్టి [1]సౌందర్యసౌమ్యత లిట్టి నేర్పు
నిట్టి నిర్మలచిత్తంబు నిట్టి పెంపు
నెట్లు నీ కబ్బె నే తప మెట్లు చేసి
తంతయును నాకు నెఱిఁగింపు మంబుజాక్షి!

200


వ.

అనినఁ గాంచనమాలిని యిట్లనియె.

201

కాంచనమాలిని బ్రహ్మరక్షస్సునకుఁ దనవృత్తాంతముఁ జెప్పుట :

క.

నా జన్మం బతిదుష్కృత
భాజన మది చెప్పఁ దడవు పట్టెడి వికచాం
భోజముఖి గిరిజఁ గొలువఁగ
రాజతగిరి కేగవలయు రాక్షస! నాకున్.

202


వ.

అని పలికి యతనిం గనుంగొని న న్నిట్లడిగెదవుఁ గాన నా
వృత్తాంతంబంతయుఁ జెప్పెదఁ దదాకర్ణనంబున నీకు మనస్తాపోవ
శాంతి యగు [2]వినుమని యిట్లనియె.

203


క.

ధరణీకాంతకుఁ దొడవై
యురుతరధనధాన్యవితతి నొప్పెడి ధాత్రిం
బరఁగు కళింగాధీశ్వరు
పురవర మేపారు పుణ్యపురుషాశ్రయమై.

204
  1. సౌందర్యసమ్మత మిట్టి (ము), సౌజన్యసౌమ్యత లిట్టి (మ)
  2. చిత్తగించి వినుమని (తి-హై)