పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

83


క.

ఎక్కడనుం డిటు వచ్చితి
వెక్కడ నీయునికి యెచటి కేగెదు పూర్వం
బెక్కడ నీపే రెయ్యది
నిక్కం బెఱిఁగిఁపు మాకు నీరజనయనా!

193


క.

మృదులలితకల్పవల్లీ
సదమల నవకాంతిఁ దెగడు సౌందర్యకళా
స్పదమగు నీరూ పెక్కడ
యిదిచిత్రం బొంటి రాక యెక్కడ తరుణీ!

194


క.

నినుఁ జూడ మేనుగన్నులు
దనుపై మది శాంతి పుట్టి తాపం బాఱెన్
వనరుహదళలోచన! నీ
తను వమృతమయంబుఁ గాఁగఁ దలఁచెద నెమ్మిన్.

195


ఉ.

నీ తడిచీర బిందువులు నెమ్మిశిరంబునఁ [1]జల్లినంతటన్
నాతలఁ పొండుభంగి దయ నాటుచునున్నది యెట్టిజంతువున్
భీతి యొకింత లేక వెసఁ బీడ మణంచి భుజించు నాకుఁ గ్రౌ
ర్యాతిశయంబుమాని ప్రియమయ్యెడు నీతనురేఖఁ జూడఁగన్.

196


ఆ.

తల్లిఁ జూచినట్లు [2]తగ సహోదరిఁ జూచి
నట్లు నిన్నుఁ జూడ నధికమైన
ప్రేమ మగ్గలించె నీ మంజుభాషలు
వినఁగ వేడుకయ్యె వనజనేత్ర!

197


వ.

అనిన విని కాంచనమాలిని బ్రహ్మరాక్షసున కిట్లనియె.

198


సీ.

తగ సుమేరుండనఁ దనరు గంధర్వుని
       పుత్రిక రజతాద్రి భూతనాథు
నర్ధాంగమున నున్న యంబికఁ గొల్చిన
       తరుణులలో నెల్లఁ గరముఁ బ్రీతి

  1. జల్లినంతలో (ము)
  2. తన (ము)