పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

పద్మపురాణము


క.

ఆ గజగామిని కనియెను
భోగస్తవనీయతీర్థ [1]పూగాఢ్యలస
ద్భాగీరథీప్రవాహస
మాగమజలవేగముం బ్రయాగము నెలమిన్.

187


వ.

కని నమస్కారంబు సేసి పూర్వస్థానంబునం దజ్జలావగాహంబు
చేసి క్రమ్మఱి గగనమార్గంబునం జనుదెంచు నప్పుడు

188

కాంచనమాలి బ్రహ్మరక్షస్సును చూచుట :

క.

కమలాప్తకిరణదుర్దమ
హిమజలధారావలీసమిద్ధవిశాలో
త్తమశిఖరతుహినపర్వత
సమధికతరుపుంజకుంజసదనముమీఁదన్.

189


వ.

సమాసీనుండై.

190


చ.

[2]కొఱుగులువడ్డ వెండ్రుకలు గ్రూరపుఁజూపులుఁ గోరదౌడలున్
గఱకగు పల్లమీసము వికారపుమేనును నంటుఁ[3]బ్రక్కలున్
బొఱడగు వీఁపును న్వలుదబొడ్డును గల్గిన బ్రహ్మరాక్షసుం
డఱిముఱి మీదుసూచి ప్రియమారఁగ నాసతిఁ గాంచి యిట్లనెన్.

191


చ.

తడిసినచీర పెందొడలఁ దార్కొన లోజిగి చౌకళింపఁగా
బడువగు కౌనుదీఁగె కుచభారమున న్వెడవ్రాల వెన్నడిం
దొడవగు వేణియం దురలితోరపుఁదీర్థపుబిందు [4]లుండఁగా
నడుగులకాంతి కెందలిరుటాకులయందము డిందఁ జేయఁగన్.

192
  1. పూగాద్య (ము)
  2. గొఱుగులు (ము)
  3. బిక్కలున్ (ము)
  4. లుంట్టగా (తి-ము)