పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

81


సీ.

కాకకు వచ్చు బంగారుపూఁదెలకాంతి
        మీఱిన యొరవచ్చు మేనుదీఁగె
కడలేని సంపూర్ణకళలచేఁ బొలుపారు
        నెలతోడఁ దులదూఁగు నెమ్మొగంబు
చక్రవాకములతో సరి కయ్య మాడుచుఁ
        గునిసియాడెడు కుచకుంభయుగము
సానదేఱిన పుష్పశరుని తూపులపెంపు
        [1]గరుసు నాటిన వాలుఁగన్నుఁగవయుఁ


తే. గీ.

గలిగి శృంగారరసమునఁ గరువుగట్టి
పంచబాణుండు సేసిన ప్రతిమ యనఁగ
దనరు కాంచనమాలిని యనఁగ నొక్క
యమరసుందరి గలదు ధరాధినాథ!

182


క.

కై లాసశిఖరిమీఁదను
ఫాలాక్షునిదేవిఁ గొలుచు పడఁతులలో వా
చాలత్వముతో [2]మెలఁగెడు
నా లేమ విలాసలీల లలుఁగులు వెడలన్.

183


వ.

ప్రయాగ మాఘస్నానార్థినియై యొక్కనాఁడు.

184


చ.

వలిపెపుఁ గావిచేల చెలువంబుగఁ దాలిచి పూచినట్టి చెం
గలువలు గొప్పునం [3]జెరివి కమ్మనిపూతమెఱుంగుమీఁద మం
చొలసిన భంగిఁ బూసి మధురోక్తులతో మణినూపురధ్వనుల్
చెలఁగఁగఁ జేతివీణె గదలించుచు నల్లన నాలపించుచున్.

185


వ.

చనుదెంచి ముందట.

186
  1. గరిమదాటిన (ము), గరువమాడెడు (మ-తి)
  2. వెలిఁగెడు (ము)
  3. జేరి (ము)