పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

పద్మపురాణము


ఉ.

వేణి విలోలనీలజలవేణి విశాలపవిత్రసైకత
శ్రోణి మరాళచక్రకులసుస్వర[1]వాణి సరోరుహోల్లస
త్పాణి సభక్తి మజ్జనవిధానవిశారద నాకలోకని
శ్రేణి మహాఘశాత్రవవిశిక్షణశాతకృపాణి యెల్లెడన్.

176


వ.

ఇట్లు ప్రఖ్యాతయైన వేణీనదియందు మాఘమాసస్నానంబు సేయ
బ్రహ్మాదిదేవతలును, ఇంద్రాదిదిక్పాలకులును, సూర్యాదిగ్రహం
బులును, యక్షగంధర్వాదిదేవయోనులును, కమలాలయాదిశక్తు
లును, రంభాద్యప్సరసలును, బితృదేవతలును జనుదెంతు [2]రందు
మూఁడుదినంబు లవగాహంబు చేసినవారి కశ్వమేధసహస్ర
ఫలంబు సిద్ధించునని మఱియు దత్తాత్రేయుం డిట్లనియె.

177

కాంచనమాలిని చరిత్రము :

తే.

అవనిఁ గాంచనమాలిని యనఁగ దివ్య
రమణి యొక్కెడ నొకబ్రహ్మరాక్షసునకుఁ
జెంది తాఁ జేయు మాఘంబునందు మూఁడు
తిథుల ఫలమిచ్చి యాతని దివ్యుఁ జేసె.

178


వ.

అనినఁ [3]గృతవీర్యుం డత్రినందనున కిట్లనియె.

179


తే.

ఎవ్వఁ డాబ్రహ్మరాక్షసుం డెట్టి భంగి
ననఘ! కాంచనమాలిని యనెడి కాంత
యెట్టి గతి నిచ్చెఁ దత్ఫల మెట్లు గూడె
నింతయును విస్తరించి నా కెఱుఁగఁ [4]జెపుమ!

180


వ.

అనిన దత్తాత్రేయుం డిట్లనియె.

181
  1. పాణి (ము)
  2. రిందు (ము)
  3. కృత్యవీర్యనందనుం (ము)
  4. బల్కు (ము)