పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

పద్మపురాణము


ఆ.

మకర[1]మాసతిథుల మాధవుఁ దలఁచుచు
నింట వేఁడినీళ్ల నెవ్వఁ డేనిఁ
దడియునట్టి సుకృతి దగ [2]ముక్తిసంపద
[3]నొనరునయ్య పార్థివేంద్ర! వినుము.

167


వ.

మఱియు వాపీకూపంబుల స్నానంబు చేసిన ద్వాదశగుణ ఫలం
బును, నదులయందుఁ దచ్చతుర్గుణంబును, దేవఖాతంబున దశ
గుణంబును, సంగమంబులఁ దచ్చతుర్గుణంబును, గంగాస్నానం
బునఁ దత్సహస్రగుణితఫలంబును సంభవించు మఱియును.

168


క.

విను మాఘంబున గంగకుఁ
జని యవగాహంబు సేయు సజ్జనముఖ్యుం
డనిమిష[4]లోకసుఖంబుల
ననుపమగతి దివ్యయుగసహస్రము లుండున్.

169


క.

[5]ఇతరనదీస్నానమునకు
శతగుణితఫలంబు వేగ సమకూఱు నృపా!
క్షితి గంగాయమునాసం
గతి మాఘస్నాతుఁడైన ఘనపుణ్యునకున్.

170


ఆ.

పాపభారమెల్ల భస్మీకరింపంగ
నెలమిఁ బ్రజలకెల్ల హితవుగోరి
[6]ధర ప్రయాగ యనఁగఁ బరమేష్ఠి గావించె
నదియె ముక్తిమార్గ మనఁగఁ బరఁగు.

171
  1. మాఘ (మ-తి-హై)
  2. నారు గుణముల (మ-తి-హై)
  3. ఫలము జెందు వినుము పార్థివేంద్ర (తి-హై) ఫలము జెందునయ్య పార్థివేంద్ర (మ)
  4. భోగ (ము)
  5. ఇతరదినస్నానంబుల (ము)
  6. వర ప్రయాగమునకు (ము)