పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

75


ఆ.

ఎవ్వనింటనేని [1]యే యోగి భుజియించి
సంతసిల్లు నతని జన్మకృతము
లైన యఘము లెల్ల నా క్షణంబునఁ బాయు
నవ్యయత్వ మొందు నాతఁ డనఘ!

151


ఆ.

కాన నాటి పుణ్యకర్మంబు నీ యగ్ర
జునకు నిచ్చి యతని సుకృతిఁ జేయు
మనిన దూత మాట విని వికుండలుఁడును
దత్ఫలంబు నపుడు దారవోసె.

152


వ.

ఇట్లు దారవోయుటయుం దత్పుణ్యఫలమాహాత్మ్యంబున నరక
కూపంబు వెలువడి మంచు విరియించి యేతెంచు మార్తాండు
చందంబున వచ్చి శ్రీకుండలుండు దమ్మునికడ నిల్చినం గనుం
గొని పులకితశరీరుండై గద్గదకంఠుం డగుచు వికుండలుం డన్న
కిట్లనియె.

153


క.

రెయ్యును బగలును నరకపు
గ్రయ్యలఁ బడి వెడల నీఁదఁ గానక మేనిం
[2]తయ్యున్నదయ్య [3]శివశివ
అయ్యో! నా యన్న! యెంత యడలితివొ కటా!

154


వ.

అని వికుండలుం డన్నకు నమస్కరించి సర్వాలింగనంబు చేసెఁ
దదనంతరంబ.

155


క.

ఇరువురఁ గని సురసంఘము
గురుతరముగఁ బుష్పవృష్టి గురియఁగ నంతన్
సురదూతఁ జూచి మ్రొక్కుచుఁ
బరమానందమున వైశ్యపతి యిట్లనియెన్.

156
  1. యోగి భుజించిన (ము)
  2. తయ్యెనె యోహో శివశివ (హై)
  3. హరి హరి (తి)