పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

పద్మపురాణము


ఆ.

గరపుటంబు మౌళిఁ [1]గదియంగ మఱియును
మ్రొక్కి సంస్తవంబు లక్కజముగఁ
జేసి పుణ్యులార! చెచ్చెర మిముఁ జూడ
గలిగె నాదు భాగ్యగౌరవమున.

146


ఉ.

ధన్యుఁడ నైతి మీచరణతామరసంబులు గంటి మంటి స
న్మాన్యగుణాఢ్యులైన మిము మానుగ నేఁ బొడగన్నమాత్రఁ జై
తన్యము వచ్చె నా కొలుచు దైవము లెప్పుడు మీర కాని నే
నన్య మెఱుంగ ముజ్జగములందుఁ బవిత్రుఁడనైతి మీదయన్.

147


చ.

అని వినుతించి యమ్మునుల కందఱకుం గడుభక్తి గంధమా
ల్యనివహధూపదీపవివిధార్చలఁ దుష్టియొనర్చి యిష్టభో
జన మిడి తమ్ములంబు ఘనసారయుతంబుగ నిచ్చి భక్తిమైఁ
బెనఁగొన నిష్టవాక్యములఁ బ్రీతులఁ జేసితి [2]వీవు వారలన్.

148


ఆ.

అంత రాత్రి యగుడు నయ్యోగివరులు నీ
మందిరమున నింపు మవ్వ మెక్క
వెలయు శయ్యలందు విశ్రమించిరి తొల్లి
యట్టి సుకృత మెన్న నలవి యగునె?

149


వ.

నాఁడు వారల కాతిథ్యంబు చేసిన తత్ఫలంబు శేషునకుం జెప్ప
నలవి గాదు. విను మొక్కవిశేషంబు సెప్పెద. భూతంబులలోనం
బ్రాణవంతంబు లుత్తమంబు; లంతకంటె మతియుక్తు లధికులు.
వారికంటె బుద్దియుక్తులగు జనులు గరిష్ఠులు. మనుష్యులలోనం
బ్రాహ్మణులు [3]విశిష్టులు, వారికంటె విద్వాంసు లుత్తములు.
వారికంటెఁ గర్తలు ధన్యులు వారికంటె బ్రహ్మవాదులగు యోగీం
ద్రు లాఢ్యులు. వారలు లోకత్రయపూజ్యు లగుటం జేసి.

150
  1. గదియించి (హై-తి-మ)
  2. నీవు (ము)
  3. శ్రేష్ఠులు వారలకంటె రామానుజ మతానుసారు లుత్తములు. వారలకంటె బ్రహ్మజ్ఞానానందమయులు ఘనులు. వారలకంటె స్వాతంత్ర్యనివృత్తులు పూజ్యులు. వారలకంటె పంచేంద్రియనిస్సారదర్శను లధికులు నగుటం జేసి (హై)