పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరఖండము-ద్వితీయాశ్వాసము

73


తే.

గొడుకు లేవురు జన్మించి కడఁక నగ్ని
హోత్రనిరతులు గృహధర్మయుతులు విజిత
మోహమాయాగుణాఢ్యులు ముక్తిరతులు
నధికవిద్యాసమర్థులునై తనర్చి.

142


వ.

ఉన్నవారలలో నలువురు సన్న్యసించి సకల ధర్మపరిత్యాగులును
నిఃస్పృహులును సమలోష్ఠకాంచనులును [1]బ్రహ్మవిద్యాపరాయ
ణులును వీతనిద్రాహారులును సర్వసహిష్ణువులునునై సర్వంబును
విష్ణుమయంబుగా విచారించి సదానందచిత్తులై తిరుగుచున్న య
మ్మహాయోగివరు లొక్కనాఁడు.

143


క.

విను వైశ్యవర్య! పోయిన
యెనిమిదియగు భవమునందు నెఱుక సమగ్రం
[2]బునఁ దనరిన విప్రుఁడ వా
యనుపమ మగు మత్స్యదేశ మావాసంబై.

144


వ.

గృహస్థాశ్రమంబునం దారసమేతుండవై యొక్కనాఁడు మధ్యాహ్న
సమయంబున వైశ్యదేవాంతరవేళ నయ్యోగివరు లధికపథశ్రాం
తులై వచ్చి నీగృహద్వారంబున నున్న వారలం గనుంగొని.

145


సీ.

హర్షాశ్రువులు గమ్మ నంగంబు పులకల
       ప్రోవులై సంభ్రమంబును భయంబు
వినయంబుఁ బెనఁగొన విష్ణుసన్నిభులగు
       వారలఁ గని యతిగౌరవమున
[3]నలువంద దండప్రణామంబుఁ గావించి
       యాసనార్ఘ్యాదికృత్యములఁ దనిపి
తత్పాదజలములు దగ శిరంబునఁ జల్లు
       కొని మనంబున భక్తికొనలు నిగుడఁ

  1. బ్రహ్మధ్యాన (ము)
  2. బొనరిన విప్రుఁడ వీవా (ము)
  3. నలిజాగి (హై-తి-మ)