పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

పద్మపురాణము


క.

ఉపకారంబును బ్రియమును
గృపయును నీయంద కల దకిల్బిషహృదయా!
యపవిత్రుఁడు శ్రీకుండలుఁ
డపవర్గము బొందుమార్గ మానతి యీవే.

139


వ.

అనిన విని [1]యమదూత కరుణాయత్తచిత్తుండై యతని మిత్ర
భావం బుపలక్షించి దివ్యజ్ఞానదృష్టిం జూచి యిట్లనియె. వైశ్యా !
తొల్లి నీ యెనిమిదవ జన్మంబునం జేసిన సుకృతం బీ నోపితేని
భవద్భ్రాతకుం బుణ్యలోకంబు గలుగు ననిన విని యచ్చెరువంది
వికుండలుం డతని కిట్లనియె.

140

వికుండలుండు తనపూర్వజన్మసుకృతం బిచ్చి శ్రీకుండలు నుద్ధరించుట :

ఆ.

అట్టి పుణ్యకర్మ మెట్టు నేఁ జేసితి
నెట్టివాఁడ దొల్లి యెఱుఁగ నాకు
నెఱుఁగఁ జెప్పవయ్య! యిప్పుడు నీ పంపు
నట్టి పుణ్యఫలము నన్న కిత్తు.

141


([2]అనిన నత్తెఱంగు వినుమని యతనికి యమదూ తిట్లనియె.)


సీ.

మధురతరంబైన మధువనంబునఁ దొల్లి
        శాకల్యుఁ డను మునిసత్తముండు
బ్రహ్మసమానుఁడు ప్రకటవేదాభ్యాసి
         విమలతత్త్వజ్ఞాన[3]శమదమాఢ్యుఁ
డతనికి రేవతి యను వధూమణియందు
         నత్యంతనియమాత్ము లాత్మపరులు
దురుఁ డన శశి యన ధ్రువుఁడు నాధీరుండు
         ననఁగ జ్యోతిష్మంతుఁ డనఁగ వరుసఁ

  1. దేవదూత (ము)
  2. (హై-తి)
  3. శమదమాత్ము (ము)