పుట:పద్మపురాణము (మడికి సింగన).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

పద్మపురాణము


సీ.

ఏకాదశికిఁ దుల్య మే ధర్మమును గాదు
        మనుజుఁ డం దుపవసించిననె చాలు;
యమునివాసముఁ జూడ నరుగక ముక్తుడై
        హరిలోకసౌఖ్యంబు నతఁడు వొందు;
గంగ గోదావరి గయ ప్రయాగాది తీ
        ర్థస్నానఫలములు రావు సాటి;
నరుఁడు గూ డుడిగి జాగర మొప్పఁ జేసిన
        ఫలమింత యంతని తలఁవరాదు;


తే.

[1]తల్లి దెసవారు పదురును దండ్రివారు
పదితరంబులవారును భార్యవంకఁ
బదితరంబులవారును బలసిరాఁగ
నతఁడు ప్రాపించు నిశ్చలహరిపదంబు.

130


ఆ.

వెలయు బాలతరుణవృద్ధత్వమునలోన
హరిదినోపవాస మబ్బెనేని
కడఁగి యెట్టిపాటి కల్మషియైనను
నరకగామి గాఁడు నరుఁడు నిజము.

131


వ.

మఱియు నొకటి చెప్పెద గోభూతిలహిరణ్యాదిదానంబు లిచ్చు
టయుఁ దీర్థసేవనంబును మనోవాక్కాయకర్మంబుల భూతంబుల
కలుగమియు నింద్రియనిరోధంబును హరిసేవనంబును వర్ణాశ్రమ
క్రియాపాలనంబును నను నివి నరకవారణంబులు స్వర్గఫలదం
బులు నని గార్గ్యాదులగు మహామునులు సెప్పుదురు గావున.

132


ఆ.

అంబరములు గొడుగు [2]లాకులు పండులు
తమ్ములములు చెప్పులిమ్ము గాఁగ
దినదినంబుఁ దనకుఁ దీఱిన కైవడి
దాన మిడుట పరమధర్మ మెందు.

133
  1. తల్లి తెగవారు పదుగురు (హై)
  2. లలరులు (మ-హై)