పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాధ్యందినం, వాధూలం, వైఘానసం, శాంభవీయం, శౌనకీయం, సత్యాశాఢి, హిరణ్యకేశి సూత్రగ్రంథాలను పేర్కొనడం జరిగింది.

ఇదేవిధంగా 18 విధాలైన పరిశిష్టలక్షణగ్రంథాలు ఆవిష్కృతాలైనట్లు కూడా ప్రాచీనులు పేర్కొన్నారు. అవి యివి ఉపలక్షణం, భాగలక్షణం, ప్రతిజ్ఞ అనువాకసంఖ్య, శరణవ్యూహం, శ్రాద్ధకల్పం, శుల్బం, పార్శ్వదం, ఋగ్యజుస్సులు, ఇష్టకాపూరణం, ప్రవరాధ్యాయం, ఉబ్ధశాస్త్రం, క్రమసంఖ్య, నిగమం, యజ్ఞపార్శ్వం, హేత్రికం, ప్రసవోదానం, కూర్మలక్షణం.

నాటిక, త్రోటిక, గోష్ఠి, సత్తకం, నాట్యరాసకం, ప్రస్థానం, ఉపలాస్యం, కావ్యం, ప్రేంకణం, రాసకం, సల్లాపకం, సృగాదికం, శిల్పకం, విలాసికం, దుర్మలికం, ప్రకరణికం, ఫల్లీనకం, భాణీకం, అని నాటికలు 18 విధాలుగా ప్రాచీనులు పేర్కొన్నారు. కొందరు సత్తక, ఉపలాస్య, సృగాదికాలగు మారుగా నట్టక, ఉల్లాస్య, శ్రీగదిత భేదాలను పేర్కొన్నారు. వీటిని ఉపరూపకాలని కూడా అంటారు.

కావ్యాల్లో వర్ణనలు సైతం 18 గానే పేర్కొనబడ్డాయి. అవి యివి - నగర, సముద్ర, ఋతు, చంద్రోదయ, అర్కోదయ, ఉద్యానవన, జలక్రీడ, మధుపాన, రథోత్సవ, విప్రలంభ, వివాహ, పుత్రోత్పత్తి, మంత్ర, ద్యూత, ప్రయాణ, నాయకాభ్యుదయ, శైల, యుద్ధవర్ణనలు. మరికొందరు వీటిలో కొన్నింటిని తొలగించి, నది, స్త్రీవర్ణనలను, బ్రాహ్మణాది చతుర్వర్ణవర్ణనలను, చతురంగసైన్యవర్ణనలను, వేదాంగవిచారవర్ణనలను సైతం చేర్చి మొత్తం 18 వర్ణనలుగా పేర్కొన్నారు. ఇదేవిధంగా కావ్యదోషాలను సైతం 18 సంఖ్యకే పరిమితం చేశారు. అప్రయుక్తం - అపుష్టార్థం- నేయార్థం- అసమర్థం- నిరర్థకం-గ్రామ్యం- చ్యుతసంస్కారం- గూఢార్థం- అన్యార్థం- అశ్లీలం- అప్రతీత - అప్రయోజనం- క్లిష్టం- సందిగ్ధం- విపరీతథీప్రథం- అనిమృష్టవిధేయం- పరుషం ఈ 18 ప్రాచీనులు పేర్కొన్న కావ్యదోషాలు- బహుముఖమైన వాఙ్మయవిభేదాలకు యేంవచ్చింది కాని, అసలు భాషాభేదాలే 18 విధాలని వక్కాణించినవారుకూడా లేకపోలేదు. ప్రాకృతభాషలు షడ్విధాలు. ఈ షడ్విధప్రాకృతాలలోనూ తత్సమ, తద్భవ, దేశ్య నామకాలుగా త్రివిధభేదాలున్నాయి. అందువల్ల ప్రాకృతభాషాభేదాలు 18 పొమ్మన్నారు కొందరు. సంగీత పదార్థాలలో సైతం, నాదం-శృతి-స్వరం- గ్రామం- మూర్ఛన- తానం- వర్ణం- అలంకారం - గమకం - జాతి- రాగం- గానం- భాష- భాషాంగం- విభాష- అంతర్భాష- ఉపాంగం- క్రియాంగం- అని 18 పదార్థాలు శాస్త్రాలలో ప్రవచించబడ్డాయి. ఆ వరసకు