పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాబాలి, నాచికేతు, కంద, లౌగాక్షి, కాశ్యప, వ్యాస, సనత్కుమార, శాంతన, జనక, కత్రు, కాత్యాయన, జాతుకర్ణ్య, కపింజల, బోధాయన, కౌణాచ, విశ్వామిత్ర, పైఠీన, గోబిల, నామకాలైన ఉపస్మృతులు 18 వున్నాయి. వీటిల్లో కూడా ఆశ్వలాయన, యజ్ఞవల్క్యాది మహర్షుల నామాలలో ఉపస్మృతులు కొన్ని వున్నాయి. ఏది యేమైనా స్మృత్యుసస్మృతులు 18 సంఖ్యకు పరిమితాలన్న సంగతి మనం విస్మరించరాదు.

మత్స్య, మార్కండేయ, భాగవత, భవిష్యత్, బ్రహ్మాండ, బ్రాహ్మ, బ్రహ్మ, వామన, వాయువ్య, విష్ణు, వరాహ, అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు 18 వున్నాయి. బ్రాహ్మపురాణస్థానంలో బ్రహ్మకైవర్తపురాణాన్ని, భాగవతస్థానంలో దేవీభాగవతాన్ని కొందరు పేర్కొన్నారు. ఈ అష్టాదశపురాణాలను పేర్కొంటూ సంప్రదాయసిద్ధమైన శ్లోకం వొకటి పండితలోకంలో ప్రసిద్ధంగా వున్నది. అది యిది -


మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం!
అ, నా, ప, లిం, గ, కూ, స్కా, ని పురాణాని పృథక్పృథక్!

సనత్కుమార, నృసింహ, స్కాంద, శివధర్మ, నందికేశ్వర, దౌర్వాస, నారదీయ, కాపిల, మానవ, ఔషనస, వారుణ, కాశీ, సాంబ, సౌర, పరాశర, మారీచ, భార్గవ, లింగ, పురాణములు 18 ఉపపురాణాలుగా పేర్కొనబడుతున్నాయి. మరికొందరు స్కాందపురాణానికి మారుగా బ్రహ్మాండ ఉపపురాణాన్ని పఠిస్తారు. మరికొందరు స్కాంద, నందికేశ్వర, పరాశర, మారీచ, భార్గవ, లింగపురాణాలకు మారుగా కౌమార, బ్రహ్మాండ, మాహేశ్వర, ప్రవర, శ్రీభాగవత, దేవీభాగవతాలను ఉపపురాణాలుగా పేర్కొంటారు. మరికొందరు స్కాంద, శివధర్మ ఉపపురాణాలకు మారుగా వాశిష్ఠ, అంగిరస, ఉపపురాణాలను పేర్కోంటారు.

కొందరు విద్యలు 18 అంటూ పేర్కొంటూ 4 వేదాలు, 4 ఉపవేదాలు, 6 వేదాంగాలు, 4 వేదోపాంగాలు ఉదాహరించారు. మరికొందరు ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వవేద, అర్థశాస్త్రాలతోపాటు చతుర్దశవిద్యలను సమ్మేళనంచేసి 18 విద్యలని పేర్కొన్నారు.

ప్రాచీనమహర్షులు 18 విధాలైన సూత్రగ్రంథాలను రచించడం జరిగిందని అగస్త్యశాకల్యం, అగ్నివైశ్యం, ఆపస్తంభం, ఆశ్వలాయనం, కాత్యాయనం, కౌండిన్యం, కౌపీతం, జైమినీయం, ద్రాహ్యాయసం, బోధాయనం, భారద్వాజం,