పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేతువు చేసిన నారాయణార్చనావిధానం, విష్ణుచిత్తుని కథ, న్యాసమాహాత్మ్యం, వంటివి మూలసంస్కృతపురాణంలో కానరావడం లేదు. తెలుగునారదీయపురాణంలో షష్ఠాశ్వాసంలోవున్న వైష్ణవమతవిషయాలూ, వైకుంఠలోకపంచావరణవర్ణనాదివిషయాలూ, సంస్కృతమహాపురాణంలో కానరావడంలేదు. సప్తమాష్టమాశ్వాసాలలోవున్న ప్రహ్లాదచరిత్రకాని, ప్రసంగవశాత్తూ మధ్యలో వర్ణించబడిన ధ్రువచరిత్ర కాని సంస్కృతమూలంలో కానరావడంలేదు. ఒకవేళ నరసింహకవికి లభించిన సంస్కృత ఉపపురాణప్రతిలో యివన్నీ వున్నాయేమో మనం చెప్పలేము. పురాణ ఉపపురాణాలలో భారత, భాగవతాది గ్రంథాలలోవలెనే ఉత్తర, దక్షిణ భారతదేశప్రతులలో విభిన్నత్వమున్నట్లు గతంలోనే ఒకసందర్భంలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ప్రచురితమై లభిస్తున్న సంస్కృత నారదీయమహాపురాణాన్ని మృత్యుంజయకవి అనుసరించగా వేరొకదక్షిణాది సంస్కృతపురాణప్రతిని నరసింహకవి అనుసరించి యీ కృతిని రచించాడో యేమో చెప్పలేము. సరైన మూలప్రతి లభించనప్పుడు యిటువంటివాటినన్నింటినీ ఊహించి చెప్పవలసిందే కాని సరైననిర్ణయం చేసి ఇదమిత్థమని తేల్చి చెప్పలేముకదా! ఒక వేళ అతనికి లభించిన మూలగ్రంథంలో వుండివుంటే, అని అతని స్వకపోలకల్పితవర్ణనలు కాజాలవు. పాఠకపరిశోధకవిమర్శకులసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్కృతమూల నారదీయపురాణభాగాలను, నరసింహకవికృత నారదీయపురాణంలోని ఘట్టాలను కొన్నింటిని తులనాత్మకపరిశీలనాదృష్టితో యీక్రింద పేర్కొంటున్నాను. వీటిల్లో కొన్ని యథామూలానువాదాలుగాను, కొన్ని అత్యంతసంగ్రహితాలుగానూ, మరికొన్ని మధ్యమంగానూ విరచింపబడినట్లు కనిపిస్తున్నాయి.

పాపేంధనస్య ఘోరస్య శుష్కార్ద్రస్య ద్విజోత్తమ।
కోవహ్నిర్దహతే తస్యతద్భావాన్వక్తు మర్హతి॥

నాజ్ఞాతం త్రిషులోకేషు చతుర్ముఖసముద్భవః।
విద్యతే తవ విప్రేంద్ర త్రివిధస్య సునిశ్చితం॥

అజ్ఞాతం పాతకం శుష్కంజ్ఞాతం చార్ద్రముదాహృతం।
భావ్యం వాప్యథవాతీతం వర్తమానం వదస్వనః॥

వహ్నినాకేన తద్భస్మ భవేదేతస్మతం మమ।

వసిష్ఠో వాచ :

శ్రూయతాం నృపశార్దూలవహ్నినాయేనతద్భవేత్॥

భస్మశుష్కంతథార్ద్రంచ పాపమస్యహ్యశేషతః॥