పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనువాదపద్ధతికి బొత్తిగా సాజాత్యం కనిపించడంలేదు. మూలపురాణంతో నరసింహకవి నారదీయపురాణాన్ని సరిపోల్చి చూచినపుడు ఉత్తరార్థంలో 3వ అధ్యాయం మొదలు 37వ అధ్యాయం వరకూ వున్న రుక్మాంగదచరిత్ర దాదాపు తెలుగులో వర్ణింపబడింది. మిగిలిన మోహినీసంబంధవృత్తాంతం - ఆమె గంగాది పుణ్యక్షేత్రాలను సందర్శించిన విషయం తెలుగులో లేదు. అంతేకాక కాశీప్రయాగాది పుణ్యక్షేత్రాలలో పిండదానవిధి నిర్ణయం - వివిధక్షేత్రమాహాత్మ్యాలూ - గంగాతీరస్థ జగన్నాథక్షేత్రాది మాహాత్మ్యాలూ యీఅనువాదంలో పరివర్జితాలయ్యాయి. భావి కృష్ణావతారచరిత్రాదివిషయాలు మాత్రం అత్యంతక్లుప్తంగా పేర్కొనబడ్డాయి. సంస్కృత నారదీయమహాపురాణంలోని పూర్వార్థాన్నిఅనువాదంలో పరిగ్రహించాలన్న దృష్టి అసలు నరసింహకవికి వున్నట్లే కనపడదు. అందువల్ల సంస్కృత నారదీయపురాణం పూర్వభాగంలోగల వివిధశాస్త్రాదివిషయాలూ సృష్టినిరూపణప్రసంగం - భూగోళవర్ణనం - భరతఖండోత్పత్తిప్రాశస్త్వవర్ణనలూ - మొదలైనవి అనేకవిషయాలు యథాతథాలుగా అనువాదితాలు కాకపోవడం ఆశ్చర్యకరంకాదు. అయితే సంస్కృతపూర్వార్థంలో వున్న కొన్ని కొన్ని విషయాలు - ఒక క్రమపద్దతిలో కాకుండా బహువ్యత్యస్తాలుగా విభిన్నప్రదేశాలలో సంగ్రహంగా ఉటంకించడం జరిగింది. కాని సంస్కృతంలో ప్రథామాధ్యాయలతో వర్ణింపబడిన నారదీయపురాణానికి మూలభూతాలైన పురాణమాహాత్మ్యకథనాది విశేషాలు కూడా తెలుగు నారదీయపురాణప్రారంభంలో నరసింహకవి వర్ణించకపోవడంవల్ల అసలు గ్రంథప్రాశస్త్యాన్నే విస్మరించిన ట్లవుతున్నది. అసలు నారదీయపురాణపూర్వోత్తరార్థాల్నే సంగ్రహపరచి వ్యత్యస్తం చేసి తన ఇష్టంవచ్చినచోట్ల కొన్నికథలను వివరించి రచించాడో, తనకు లభ్యమైన అసమగ్ర ఉపపురాణంమీద ఆధారపడి యీ నారదీయపురాణకృతిని రచించాడో, ఇదమిత్థంగా చెప్పలేము. అయితే నరసింహకవి అనువాదపద్ధతి మాత్రం నన్నయాదుల భారతాది గ్రంథాల అనువాదపద్ధతిలోనే నడచిందని చెప్పవచ్చును. కాని లభ్యమైన సంస్కృత నారదీయమహాపురాణాన్ని దృష్టిలో పెట్టుకొని చూచినపుడు నరసింహకవి కృతమైన నారదీయపురాణంలో అసలు సంస్కృతమూలంలో లేనటువంటి అనేకవిషయాలు కనిపిస్తున్నవి.

తెలుగు నారదీయపురాణ ద్వితీయాశ్వాసంలో వున్న కల్యాణతీర్థోత్పత్తి - మహిమ, సుచరిత్రుని చరిత్ర, కనకమాలిని యదుశేఖరుల కథ, యాదవాద్రివర్ణనం, చతుర్వేది కథ, ఇత్యాది విషయాలు మూల నారదీయపురాణంలో అసలు కనిపించడం లేదు. తెలుగు నారదీయపురాణంలో తృతీయాశ్వాసంలో వర్ణించిన పాషండమతభేదం, వ్యాఘ్రవానరకిరాతసంవాదం, నాళీజంఘుని కథ, తులసీమాహాత్మ్యం, ధర్మ