పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

[1]మునుపు గలుగు ఘటఘునట్ల వెనుకఁ గలుగు
నది యకార్యంబ కార్యంబు ననఁగఁ బ్రాగ
భావకాపతి యోగియై పరఁగి యుండు
నర్థశాస్త్రపరిజాత లరసిచూడ.

96


సీ.

ఏఁదక్క నితరుల కెఱుఁగంగరాకుండఁ
                       జేసితి నేనె విచిత్రమైన
మామకసంకల్పమహిమ తద్భక్తిమై
                       మత్తత్వధీసుధామధురరసము
లసురులఁ గ్రోలింతు నతిరోగశిశువులఁ
                       జక్కెర యనుచు నౌషధముఁ దల్లి
ద్రావించు నట్లు తత్త్వజ్ఞాన [2]ముదయింప
                       బోధించునట్టి దుర్బోధమతుల


తే. గీ.

నబ్జజాండాంతరావాస మపనయించి
యిచ్చటనె యుండుఁ డిమేరలె నని జగము
వెలయఁజేసిన దనిక తద్విధము మీకు
నాదరంబున నెఱిఁగింతు ననఘులార!

97


మ.

అల సుజ్ఞానులు నాకు నిష్టతము లత్యంతంబు మీ రట్టివా
రలలో మిక్కిలి నాప్తు లౌట మిము సారస్ఫూర్తి పంచింపఁబో
ధలవోదగ్రతచేత నీభవనయంత్రం బంతయుం బూనెదం
గలదే మా యిక నాటకంబు గడపంగా దుష్కరం బెద్దియున్.

98


క.

[3]నామాయామయమోహిని
పామరదానవుల భ్రాంతి పఱచుట యఱుదే!
నామాయఁ దెలియఁ జిత్రము;
సామాన్యుల కెల్ల నెఱుఁగ శక్యం బగునే!

99


సీ.

మన్నింత్రు కింకరుల్ మాననీయులు మన్ని
                       యోగంబు కతన ననూనయశులు
సత్యసంకల్పు లాసురవంశమునఁ బుట్టి
                       తత్సమాకారేంగితప్రకార

  1. మునుపు గలుగు ఘటమట్ల వెనుకఁ గలుగు
  2. ముదయించ
  3. నామాయాయొగి మోహిని