పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

దుర్జనాజ్ఞానతమముఖోద్భూతశక్తి
యైన సుజ్ఞానభానునిచే నడంచి
నిల్చెద మహాత్ములార సునిశ్చితాత్ము
[1]లై మనోవ్యథ నొందకుఁ డనఘులార.

92


క.

ఏమూఢులు నిగమైక
ప్రామాణ్యము విశ్వసించి [2]పాటింపరు నే
నామూఢులఁ దెల్పెద న
న్నామైఁ బ్రత్యక్షమునఁ దదనుమానమునన్.

93


తే. గీ.

[3]అఖిలవేదాంతవేద్యవిశ్వాత్మశీల
మైన మత్సత్వవిజ్ఞాన మసురులకు జ
నింపఁజేసెద మన్మనోన్నిద్రశక్తి
ఘనతరంబైన సంసృతి క్రమమునందు.

94


క.

ఏసంకల్పంబుల నేఁ
జేసినను ఫలానుమేయసిద్ధంబులు ప
ద్మాననముఖ్యుల కనుపమ
ధీసంపన్నులకు నైనఁ దెలియఁగ వశమే!

95


సీ.

ఇట్టి నాసంకల్ప మెఱుఁగకయున్న సా
                       ర్వజ్ఞభంగము గాదు వనజసంభ
వాదుల కెఱుఁగంగ నలవికానిది యెఱుం
                       గకయున్న నజ్ఞత గా దెఱుంగ
వచ్చినయది బుద్ధివలన నెఱుంగక
                       యున్నచో నజ్ఞత యొగి నశక్య
మయిన కార్యము సేయఁగను శక్తుఁడు గాని
                       యతఁడు దక్షుఁడు గాఁడె యరసి చూడ

  1. లె మనోవ్యధ
  2. పాటించరు
  3. అఖిలవేదాంతవేద్యవిశ్వాత్మైకశీల