పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/607

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ. వె.

దేవదేవ! స్వామి! దివ్యవిజ్ఞానప్ర
దానదక్ష! యాత్మదానధుర్యు
నీదుధామ మెట్లు నే మెట్లు బ్రహ్మాది
దుర్లభంబు మాకు దొఱకు టెట్లు?

88


క.

స్వామి! యకించనులము మీ
శ్రీమత్పాదాంబుజములు సేవించి మహో
ద్దామజ్ఞానసుధాబ్ధిన్
సేమంబున నీదుకరుణఁ జెందితి మెట్లున్.

89


వ.

మనోవ్యథ తీఱెను; దుర్జ్వరంబువలె నున్నయది యొకటి బ్రహ్మాండో
దరవర్తులైన ధీరులు యుష్మద్విరోధులైన యసురులచే బాధ నొంది
వర్తించిరి; తత్సాధుద్రోహంబువలన వారికి నప్పుడే ఘోరయాతన
లెటువంటివి గాఁగలవో వారి నెవ్వఁడు రక్షించు భవద్దర్శనానంద
సాగరంబున మునింగి యింతకాలంబు మఱచితిమి; ముం దరమర
మే మోభవపయోధి మునింగి తెప్పలేక యున్న మమ్ముం గావు; ప్రసన్న
పారిజాత! నీవు దక్క నెవ్వరని విన్నవించినఁ బ్రసన్నాస్యుండై
సనకాదులతో భగవంతుం డిట్లనియె.

90

శౌరి సనకాదులకు మోక్షప్రాప్తివిధానం బెఱింగించుట

సీ.

యోగీంద్రులార! మీ రుత్తముల్ వినుఁడు మ
                       దాత్మగతంబైన యాదురాభి
మామకులైన మీమానసంబులఁ బ్రతి
                       బింబించి కాన్పించెఁ బెద్ద యగుచు
నల మామకజనంబు లంతయు నేనును .
                       బ్రాప్తకాలమ్ము స్వభావముననె
యైన లోకానుగ్రహార్థత నన్యుఁ డా
                       దుఃఖంబుచే నతిదుఃఖ మంది


తే. గీ.

యుండుటలు పూర్ణకాముల కుచితవృత్తి
యార్తులగు వారిఁ జూచి తారార్తులైత
[1]దార్తి మాన్పఁదలంచెద రట్లు గాన
[2]మోహతాపంబులకు నింక మోడ్పు గలదె!

91
  1. దార్తి మాన్పదలంతు రట్లుగాన
  2. మోహాతాపముల కింతమేర కలదె