పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/606

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

కామితార్థ[1]ప్రదానదీక్షావ్రతమున
నర్థులకుఁ బరిణామహితార్థ మిచ్చు
నట్ల యొసఁగఁ దలంచనేన పరిణామ
హితము యోగీంద్రులార మీ రెఱిఁగికొంద్రు.

81


క.

పరిణామహిత మనంగా
నరయఁగ భవనాశహేతు వగు నెన్నికఁగాఁ
బరిణామాహిత మనఁగాఁ
బరగున్ భవబంధకృత్యవదకారణమై.

82


వ.

ఇట్లు నాకు స్వాధీనవిశ్వత్వ ముపనిషత్తులు పలికె నట్లనే నాకుఁ
గర్మకాండంబును సావకాశం బయ్యె నిందునకు సందేహంబు [2]లేశం
బును లేదు; నన్ను నెవ్వి యడుగవలయు రహస్యం బడిగెద రది
యెఱింగింతు వినుండు.

83


మ.

హరి వేదూక్తి ననాద్యజావృతనిజాత్యంతప్రబోధప్రభా
పరమాజ్ఞాజ్ఞజనాంతరాత్మయయి సంభ్రాంతాత్ములన్ సద్విష
గ్వరుఁ డాయుశ్రుతి శక్తి రుగ్మిఁబలెఁ బ్రాక్కర్మోచితప్రక్రియా
గరిమం దా నియమించుటం గొలువఁగాఁ గాంక్షింతు రయ్యుత్తముల్.

84


ఆ. వె.

ఘనత నిట్లు కర్మకాండాగమాంతవా
గ్రూపవేదహృదయరూప మెఱుఁగు
భవ్యులకును గర్మఫలము లొసంగు నా
యందుఁ బుట్టు భవము లడఁచుఁ దలఁపు.

85


చ.

హరి గరుణించి యిట్లు తమ కానతి యిచ్చిన వీతమోహులై
పరువడి మ్రొక్కి మ్రొక్కి బహుభావములం గొనియాడి యాడి హృ
త్సరిగతసంశయం బుడిగి ప్రాంజలులై యతిలోకశేఖరో
త్తరు లతిశోకశీలుఁ డగు తత్పరమేశ్వరుఁ గాంచి రంతటన్.

86


వ.

ఇట్లని వినుతించిరి.

87
  1. ప్రథాన
  2. వేదంబును