పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అనీశ్వరాత్ములై కర్మములందు స్వతంత్రులు గానివారికిఁ గర్తృత్వ
మెక్కడిది? పాణిని "స్వతంత్రః కర్తా” యనఁడు గాన.

63


ఆ. వె.

ఫలము కర్తృగామి పరికింప ననుచు మీ
మాంసకులు వచింతు రఖిలకర్మ
ఫలమ కర్త లగుచుఁ బరఁగిన నరులకు
నవ్వయించునే నిరంతరంబు.

64


క.

వెలయఁగ సఫలాన్వయులకుఁ
గలుగునె కర్మాధికారకల్పన కర్మం
బుల నైశ్వర్యముఁ గాంచుట
పొలుపుగ నధికార మనిరి బుధవరు లెల్లన్.

65


సీ.

అందఱు ననమర్థు లగుదురు నరులు రో
                       గాదిపీడితు లసమర్థు లందు
విధి చెప్పఁబడదు భావింప వారికి నధి
                       కారంబు లేదు లోకమునఁ గొంద
ఱతిసింహబలులు కామామయార్థితు లతి
                       కామార్థితులు విధిక్షములు వారు
సతతరజఃక్రోధజవికారవశమున
                       నిరపత్రపాత్ములు నిర్దయులును


తే. గీ.

నీచవృత్తులు నగుచు వినిశ్చితంబు
[1]గా నిషిద్ధక్రియల్ సేయఁబూనువారి
[2]త్రిగుణకాననావచ్ఛిన్నధీబలాతి
కామరోగుల నియమించఁగాఁ దరంబె?

66


వ.

దేవా! స్మృతిసహితవేదమత్వదాజ్ఞ యని వింటిమి భ్రాంతుల
నాజ్ఞాపించు స్వామి యట్టి వివేకవంతుండుగు.

67


మ.

'అతిచిత్రార్ధము లౌ శృతిస్మృతులు మాయాజ్ఞల్ తదుల్లంఘన
స్థిత మద్ద్రోహ' మటంచు నాడితిరి లక్ష్మీనాథ! తద్ద్రోహదు
ర్మతులం దెల్పుచు మీఱినం దెగుచు సమ్యగ్భక్తియై నిల్చు సు
వ్రతుఁడౌ స్వామియు నెన్నిచందములు విభ్రాంతుండు గాకుండునే?

68
  1. గా నిషిద్ధక్రియలే సేయఁబూనుఁ
  2. స్వాత్రిగుణకానాద్యచఛన్నధిబలాతి