పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/603

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

అబుధు లసమర్థులు ననర్ధులైనవారు
నిందు నధికారయోగ్యత నందఁగలరె?
యనుచు మామానసములు మోహంబురాశి
[1]మగ్నము లగుచునున్నవి మఱియు మఱియు.

69


క.

హరి సత్వసత్వవేదివి
పరమదయానిధివి మోహబంధాంతరసం
హరణైకకారణం బగు
వరవిజ్ఞానంబు దెలుపు వాత్సల్యమునన్.

70


వ.

ఈయనుయోగాపరాధంబు సహింపవే యని విన్నవించిన సనకా
దుల తత్త్వశుద్ధికి మెచ్చి యిట్లని యానతి యిచ్చె నప్పుడు.

71


సీ.

వెరవకుఁడీ యోగివిభులార! [2]మీర లు
                       త్తములు మీ కెఱిఁగింతు దయ దలిర్ప
స్వాధీనమగు విశ్వమంతయు నదిగాన
                       నరుల బోధించెదఁ బరమనియతి
దీపించు నాదుశ్రుతిస్మృతి శక్తి గొం
                       దఱు ప్రవర్తింపఁ గొందఱు నివృత్తి
యంద తత్ప్రాగ్భవీయానేకకర్మాను
                       [3]రూపపురాణాదు లేపు చూప


తే. గీ.

ధరణి మద్దత్తమైన స్వాతంత్ర్యశక్తి
తత్కృతార్ధఫలావహత్వము వహించు
సత్యసంకల్పత సదా ప్రశస్త మగుచు
...............................................

72


క.

అరణిగతానలశక్తి
స్ఫురణంబును బోలె బద్ధపురుషులశక్తి
స్ఫురణము ప్రకాశ మందదు
పరిపూర్ణజ్ఞానమహిమబద్ధం బగుటన్.

73
  1. మగ్నము లగుచున్నయవి
  2. మీరు ఋషిస
  3. రూపతత్వపురాణాదు లేపు చూప