పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/601

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తదధీశ్వరాజ్ఞాపితస్థితి సుఖదుఃఖ
                       ములు రెండు చెందుదు రలఘుశక్తి
[1]ప్రబలి ధర్మాధర్మబహుళదానాధికా
                       రుల ప్రభువులఁ జాలఁ బ్రోది సేసి


తే. గీ.

యాత్మసంకల్పమున నీయదార్థములు ఘ
టించ నెల్లప్పుడును నియమించు ధర్మ
దేవతయు నాయధర్మాధిదేవతయును
భగవదిచ్ఛానువృత్తి సంపత్తి కతన.

57


వ.

ధర్మాధర్మాభిమానదేవతలు శ్రుతిపారగులచేత నిట్లని పలుకంబడి
యెను; వేదపురుషాభిప్రాయసందర్శన మగు తద్విజ్ఞాపనంబు తెలియ
నవధరించి నవ్వుచు ద్విజులఁ జూచి భగవంతుం డిట్లనియె.

58

శౌరి సనకాదులకు కర్మకాండాదివిషయంబు లెఱింగించుట

క.

జిజ్ఞాసువులై మీరలు
ప్రాజ్ఞులు న న్నడుగఁజూచు పద్ధతి దోఁచెన్
జిజ్ఞాస వొడమఁజేయును
సుజ్ఞానమె మత్ప్రసాదశోభనలీలన్.

59


క.

బ్రహ్మవిదుత్తంసులు స
ద్బ్రాహ్మణసత్తములు పూర్ణభగవద్భక్తుల్
బ్రహ్మం బిట్లాడిన విని
జిహ్మేతకులై యడిగిరి చేతోగతులన్.

60


క.

సర్వోత్తమ హరి స్వాఖిల
సర్వాత్మానాత్మవస్తుసంధాయక! నిన్
సర్వము నడిగెద మిపు డో
సర్వేశ్వర! నీదుకరుణ సాధ్వస ముడుగన్.

61


క.

సేయుఁ డిది సేయకుం డిది
పాయక మును గర్మకాండ పరిచితవిధు ల
త్యాయతిఁ బల్కఁగ సేయం.
జేయకయుండన్ సమర్థశీలురె మనుజుల్.

62
  1. ప్రబలి ధర్మాధర్మదానాధికారుల