పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/598

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వలెనే; ఆవ్యుత్పత్తి లోకవేదభేదంబులచేత ద్వివిధంబై యుండు
నారెంటిలోన మొదలిలౌకికవ్యుత్పత్తి ప్రత్యక్షభేదంబుచేత నిష్పన్న
మైనయది: యన్యంబైన యీవైదికవ్యుత్పత్తి యాగమంబుచేత
నైనయది; ఆమూకబాలకులు జన్మంబు మొదలుకొని నయనములు
దెఱచి ప్రతిదివసంబునందును దృశ్యములు చూచుచు నున్నవారలై
కార్యంబునందు స్వపరవైషమ్యంబు దెలిసి తలిదండ్రులం జూచి
దైవవశంబునం బ్రథమవాసన గలవారలై యంతదాత యనియు నంబి
యనియుఁ దన్నామంబులం బల్కుదురు. సత్సంజ్ఞాసంజ్ఞాసంబంధ
జ్ఞానజిజ్ఞాసులైన స్వకీయులచేత 'మీతండ్రి యేఁడి' యనియు 'మీ
తల్లి యేది' యనియు నడుగంబడిన నాబాలకు లాతండ్రినిం దల్లినిఁ
దర్జనిచేత నిరూపించి తాతాంబేత్యాదిశబ్దములకు నావాక్యంబునందుఁ
గార్యాన్వితార్థ గలదా? వారికిం బ్రథమశబ్ద మగుటం జేసి మున్ను
గార్యపదాన్వయము లేదు; ముందఱను దత్కాలంబునందును
దావన్మాత్రపదోక్తిం బట్టుండి లే దంతకంటే ముందఱికాలంబుల
యందును యాహియహి యనియెడి భాషణము పూర్వకాలికవాక్య
కార్యాన్వయావహమై వ్యాప్తమై యున్నయదియుం గాదు; సమస్త
ప్రవర్తనంబులయందును గార్యతావగతివలననే హేతుత్వ మని
పలుక మదిగాన వ్యాహారసంభ్రమ మనియును గార్యాన్వయ
మితంబునందును ద్యశబ్దార్థసంగమబుద్ధిప్రాగ్భవీయాత్మపుణ్యాను
రూపకాలసమిద్దశక్తి గల సంజ్ఞే సంజ్ఞాన్వయోల్లేఖి ప్రథమజ్ఞాన
హేతువైన నవికల్పకసంజ్ఞితమైన ప్రత్యక్షంబుచేతం జేయంబడినయది;
నిఘంటుప్రముఖంబులైన యుపాయంబులచేతను గార్యాన్వయంబు
విడిచి వీనికిని వినామంబు లగుచున్నయవి యని బోధించువారిచేత
వాక్కులకు సిద్ధబోధకత్వంబు ప్రపర్తించునని మనుష్యులకు [1]'బాధ
యంతీతి వాం సాహ్ని (?) ఛందాంసి' ఇత్యాదివైదికంబులైన నిర్వ
చనంబులచేత సిద్దమాత్రాన్వయబుద్ధి వాక్కులకు నయ్యెడునది గానఁ
బద మొకానొకయెడం గార్యానన్వితంబైన యర్థంబును జెప్పు నొకా
నొకయెడం గార్యయుక్తార్థంబునుం జెప్పుమని నిర్ణయంబు సేయుట
యుక్త మిది గాన మంత్రార్థవాదంబులకును గార్యాన్వయంబు విడిచి
యేస్థలంబునందుం దమలోఁ దమకు నన్వయంబు దృష్టమైనయది
యదియందుఁ గార్యంబునందును బ్రమాణత యంగీకరింపఁబడిన
యది. స్వర్గాదికంబునందుఁ బదార్థములకు సార్థ[2]నిష్ఠత మానాంతర

  1. ‘బాధయంతీతి సాహ్నిఛందా' నిత్యాది
  2. నిష్టత