పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వేదార్థం[1]బయిన మిక్కిలియు న్నెఱుంగరు; సర్వశబ్దంబులకును
లోకంబులయందుఁ గార్యాన్వితార్ధత గల దాలిఙాదికంబునకు లౌకి
కంబునందుఁ గార్యాన్వితార్థత్వంబు లేదు గాని లౌకికమైన 'గామాన'
యేతి వాక్యంబునం దానయము కార్యంబు గా దాపద మేమిటిచేతఁ
గార్యాన్వితార్థ మయ్యెడి, నేకవాక్యంబునందుఁ గార్యద్వయంబు
లేదే – కార్యద్వయంబుచేత నాపదంబులకు నన్యోన్యాన్వయం
బయ్యెడి; తత్పదంబులకును గార్యాన్వితార్థత యయ్యెడిని; కార్య
పదంబునకంటె నన్యపదంబు సమస్థలంబులయందును గార్యాన్యి
తార్థత్వంబు విడువదనియును బ్రకారంబు గాక యుండం [2]జూచుటం
బట్టుండియును నియమంబు లేదు: లిఙోలోట్తవ్యావృతమయోగులైన
పదంబులకే వాక్యత్వ మనియును నియమంబు లే దన్యములైన
పదంబులకును వాక్యత్వము చూచినారము గనుక 'కింతేస్తే వేద
విద్యతి' యనియెడునది ప్రశ్నవాక్యంబు; తదుత్తరవాక్య మయ్యెనేని
'యస్త్యేవ మేవేతి' యనియెడునది యీప్రశ్నోత్తరవాక్యంబులకు
లిఙాద్యన్వయం బెక్కడిది? వక్తలయందు భూతవాక్యంబులయందు
సిద్ధివ్యుత్పత్తివిషయమై యుపాయంబులు గలుగుచునుండఁగాను,
బరులచేత నేమి యాకాంక్షాద్యనుబంధంబుగల తిఙ్సుబంతకదంబకము
వాక్యవ్యవహారంబునకు నంగమై యుండునది; లోకవేదంబులయందు
భూతవర్తమానభవిష్యత్ప్రత్యయనమభినైష్యద్విజయవ్యాహృతుల
యందునేని లిఙాద్యన్యతమముతోడం బదంబులకు నవ్యగన్వయంబు
లేదే! యన్వయముచేత నావాక్యంబులు కార్యార్థంబులు సాక్షాత్తున
నయ్యెడిది; భూతవాక్యంబులయందును లిఙాద్యన్వయ మెటుగాన
సర్వవాక్యంబులును భూతార్థంబులుగా నిశ్చయింపఁబడుచుండ
లోకంబులందును వేదంబులందును భూతవాక్యంబులకు సిద్ధి [3]నిష్ఠ
యగును; లిఙాద్యన్వితవాక్యంబులచేఁ గార్యార్థ[4]నిష్ఠత యగు నిట్లని
యోగ్యాన్వితంబులైన వాక్యంబులందు నాద్యంబైన సంగతిసంగ్రహం
బాసర్వవాక్యంబులందు గార్యత్వం బుద్దిష్టప్రవర్తిక యైనది గా
దిష్టసాధనతాబుద్ధికిం తత్ప్రవర్తనహేతుత్వంబు సమ్మతంబు; కృతి
యోగ్యోష్టహేతుత్వబుద్ధియె యుభయసమ్మతంబు; కార్యబుద్ధి[5]యై
నచోఁ ద్యాజ్య; ముభయసమ్మతము గా దిదిగాన సర్వవాక్యంబులును
గార్యార్థంబులే యనియెడునది యుక్తంబు గాదు; వ్యుత్పత్తియు నటు

  1. బయితే
  2. జూచుటం బట్టుండిన్ని
  3. నిష్ట
  4. నిష్టత
  5. యైతే