పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/596

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చిదచిద్రూపవిశ్వనియామకుండైనవాఁడును లేదా తనయందు నను
పప్లుతంబైన ప్రత్యక్షంబు గాని యనుమానంబు గాని లేదు; శ్రుతికిఁ
గార్యానన్వితసిద్ధార్థంబునందుఁ బ్రామాణ్యంబు లే దిది గనుక సర్వే
శ్వరునియందు నేమియును బ్రమాణంబు గా దనిరి; వేదాద్యభాగ
తాత్పర్యన్యాయసూచకుండైన జైమినిముని యభిప్రాయంబు నెఱుం
గని దుర్బుద్ధులు నందికేశ్వరశాపానురూపకేవలకర్ము లైరి; వా రల్ప
బుద్ధులైన బ్రాహ్మణులును వారిని వైదికులంగాఁ దలంచి ప్రతిపదంబున
నంధలగ్నాంగులుంబలె నవలంబించి కర్మలగ్ను లగుదురు; పుత్రా!
వారి బుద్ధిమాంద్యంబుఁ దెలిసి దేవతలు యాతయామంబులగు
కర్మంబులు చేసి దుఃఖపడుచున్నవారి కిట్లని దుఃఖ మందుదు రగ్ర
జన్ములైన యీద్విజులకు బుద్ధిమాంద్య మయ్యె; నాశ్చర్యం బెవ్వరు
వేదకృత్స్నతాత్పర్యంబునందే తలంచిరి, కార్యమాత్రపరత్వ
మయ్యెనేని కృతికి నెట్లు సమ్మతమై సిద్ధించెడిని? ప్రయోజనపదార్థావ
బోధకత్వంబు శ్రుతికి సమ్మతంబు విచారించుచుండ సుఖమే లోక
ములయందుఁ బురుషార్థమై సమ్మత మగు దుఃఖహాని యయ్యెనేని
జనులచేతం దనయంతనె యంగీకరింపఁబడదు; దుఃఖానువృత్తి
యందు దుఃఖం బనుభవింప నిష్టంబు గానియది యని తనయంతనె
దుఃఖహాని పురుషార్థంబు గాదు. [1]సుఖమైన తనయంతనె పురుషార్థమై
తగు; నీప్రకారంబునను సుఖపురుషులచేతం బ్రార్థింపంబడునని
దానికిఁ బురుషార్థత్వంబు యుక్తంబు; ఇతరంబున[2]కైనచో లేదు.
దానికి బారంపర్యంబుచేత గాని సాక్షాత్తు గాని పురుషార్థిత్వ మాపే
క్షిత మని పురుషార్థ మగుటచేత మిత మని యుండఁగా నిటువలెఁ
బారంపర్యముచేతఁ గాని సాక్షాత్తు గాని పురుషార్థమై సమ్మతంబు గాని
యాకార్యంబు తనంతటనే పురుషార్థ మెట్లగు? ఎవ్వరికిఁ గేవల
కర్మమే శ్రేయం [3]బగును; సుఖంబును శ్రేయంబు గాదు; తద్ధేతువును
శ్రేయంబు గాదు; దుఃఖవిలయంబును శ్రేయంబు గాదు. వారు దుర్భగు
లెవ్వరికి సర్వకార్యంబులు నశ్రేయఃప్రతిపాదకత్వసుఖబ్రహ్మ
ప్రసక్తికొఱ కగును వారలె సుభగులు బుధులు; ఏమి చేయుదుము;
పరబ్రహ్మంబైన విష్ణు వెవ్వరికిం బ్రసన్నుం డగుచున్నవాఁ డాప్రాణి
విశేషంబులు దయచేతను బుద్ధు లెవ్వరు తన్నిర్హేతుకకారుణ్యవిష
యలు గాని వారికి బుద్ధులు స్ఫురింపవు; లోకములు న్నెఱుంగరు.

  1. సుఖమైతే
  2. కు
  3. బౌను