పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నీను సమర్థంబు గా దస్థిరంబు గాదు. స్థిరంబుగా విధిచేత నిశ్చయింపఁ
బడియె నిది మొదలుగాఁ గల దాని నెవ్వరు పల్కుదురు వారు జై మిని
మతానుగులు; మఱి [1]యేమే యనియును పలుకుదురు వారు జైమిని
మతస్థులు. ఆవేదప్రవర్తకుండైన యాజైమినిముని వేదాభిమాన
దేవతాకూతవిపరీతమైన యీమత మెట్లు చేసెను? వైదికశేఖరుండవై
నయోతంత్రీయపన్యాయతమోభాస్కరసునయోక్త్యసిధారచే
నీసంశయంబుఁ ద్రెవ్వం జేయుమని కుమారుఁడైన శుకుండు పల్కిన
[2]ప్రశ్నభాషణంబులఁ గన్నులు వికసించి వేదాభిమానదేవతాకూత
తత్త్వవేదియైన వ్యాసుం డిట్లనియె.


వత్సా! యీ దుర్వాదృగ్వాదిజన్మనిమిత్తంబు నీ వెఱింగి
యును దద్వాక్యంబులకు క్షుద్రనయార్థిత్వప్రసిద్ధికొఱకు నడిగితివి,
విను; మిటువలె వాదించు వాదులం బూర్వంబునందు నందికేశ్వరుని
చేత శపింపఁబడిన దేవద్వేషులు భూమియందుఁ బెక్కండ్రు నిర్భా
గ్యద్విజులై కుమేధస్సులై పుట్టి యయధాభిదైకదేశలేశులై తోఁచినట్లు
వేదార్థనిర్ణయమునందు నింత యనియెడు పరిమితి నివేదనంబునందు
నింతయన్న [3]పరిమితిని, కూపకూర్మసమానాభిమానులై వేదాంత
సాగరంబుల నసంఖ్యేయంబులఁగా నెఱుంగక దేవమాయామోహితులై
తలంచిరి; సమస్తవేదంబులును గార్యపరమే కావలయునని తన్న
యంబునఁ బలికి వేదంబునందును బదవాచ్యబుద్ధిలోకవ్యుత్పత్తి
మూలమైనదియె; కార్యానన్వితసిద్ధార్థవిషయమై లోకంబునందుఁ
బదసంగతి లేదు. మఱి యేమి [4]యన: కార్యాన్వితంబైన కార్యమునం
దేరి ఙాద్యన్యతమాభిధ యగు నటుగాన మంత్రార్థవాదంబులకును
గార్యాన్వితార్థత యనియెడు హేతువువలన సమస్తవేదంబులును
గార్యపరంబు; శ్రేయస్సును గార్యపరమే; శ్రుతితాత్పర్యగోచరమైన
శ్రేయస్సు దానికంటె మఱియొకటి కాదు; కామ్యార్థంబునందును
గార్యాన్నమైన స్వర్గాదిసంజ్ఞత ఫల మెద్ది గల దది యానుషంగికఫల;
మిష్టమైనదాని నిచ్చుచున్న ప్రభువైన రాజుంబలె మాకుఁ గార్యమే
ప్రధానంబు; ద్రవ్యంబుబలెఁ గార్యంబు గూర్చి దేవతలు ప్రధానం
బులు గారు; వారలకు భోక్తృత్వము[5]ను యాగప్రసన్నత్వము[6]ను యాగ
ఫలదాయకత్వము[7]ను వేదనివేదదూషకులు చెప్పుదు; రింతియె కాదు

  1. యేమే యనియున్ను
  2. ప్రశ్నభాషణంబులు
  3. పరిమితినిన్ని
  4. యంటేను
  5. న్ను
  6. న్ను
  7. న్ను