పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/594

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

మదిలోన వేదాభిమానదేవతకు ని
                       యాకూత మిట్లుండ నందు ద్విజులు
వైమనస్యమునంద వచ్చు నేరీతిని
                       వేదోక్తకర్మముల్ వివిధములయి
యమరవిశ్వైకవస్త్వంతరాత్మకుఁడైన
                       విష్ణువునకుఁ బ్రీతి వెలయఁజేయు;
నాతండె కర్మఫలాదు లీనేర్చువాఁ
                       డనిరి కొందఱు; కొంద ఱతనిఁ గొల్చి


తే. గీ.

యలఘుమతులకు నిట్లు కాదనిరి; కొంద
ఱాత్మపక్షానుగుణము లౌనట్టి నయము
లాడి ; రొక కొంద ఱిట్లు కార్యాన్వయంబె
యనిరి సిద్ధాన్వయంబు గాదనుచు బ్రమసి.

50


వ.

ఇట్లు లోకానుసారంబున వేదంబునందేని యర్థం బెవ్వ రెఱుంగుదురు?
వారికి నాగమంబు కేవల సిద్ధమైనదానిని బోధించు ననియెడు
వాక్యం బెక్కడిది? 'గామాన' యేత్యాది వాక్యేష్టగవానయనాదుల
చేత నన్వితార్ధంబులు బోధించు నీవాక్యంబు పదంబులు నీలోకంబునం
గల దిదిగాన వేదంబునందేనియుఁ గార్యాన్వయంబు బాసి కించిత్తేని
యన్యపదంబులకు స్వార్ధనిష్ఠత్వంబు లేదనుట నిశ్చయ మందు
మంత్రార్థవాదములకుం బలె నుపనిషత్తులకును గార్యాన్వితార్థ
నిష్ఠత్వంబు గాని సార్థ్వైక[1]నిష్ఠత్వంబు లేదు; మత్కార్యంబు
యాగాదికంబు గాని యుపాస్తి గాని యుచితంబగు నుపాస్తి బుద్ధులకు
యదార్థత్వనియమ మనియెడునదియును లేదు; యోషిదగ్నియాది
వాక్యవాక్యంబులకుంబలె నుపనిషత్తులకు యథాప్రతీతసిద్ధార్థ
[2]నిష్ఠత్వమును నియతంబు గాన వేదాంతమీమాంసారంభము[3]ను గాక
పోవు నిటుగాన బుధుఁడు తద్వాక్యంబుఁ బ్రమాణంబు చేసి యెవ్వని
బోధించు [4]నిట్లని యుండఁగా దేవత[5]యును ద్రవ్యముంబలెఁ గార్యశేష
త్వముం బొందునని కార్యమే కామజనంబులకు నిష్టమైన ఫలం బిచ్చు;
నందు క్షణధ్వంసియైన కార్యంబు కాలాద్యంతరభావియైన ఫలంబు

  1. నిష్టత్వంబు
  2. నిష్టత్వమున్ను నియతంబు
  3. న్ను
  4. నిట్ల నుండంగా
  5. న్ను