పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మాత్రమున దానికి నది యర్థంబు గాదు; మఱి యేమి [1]యన చేతనుం
డందే యర్థంబు నర్థతత్వాలోచనచేత నటువలె నహంపదవాచ్య
నిర్ణయ మటువలెనే తద్దేవతావాచిపదవాక్యనిర్ణయ [2]మగు
నిటువలెఁ గాఁగా నాత్మానాత్మాసమస్తవస్త్వంతరాత్మవైన నీకుఁ దత్త
చ్చతుర్థ్యంతపదోద్దేశ్యత్వంబు తెలివిపడును శ్రుత్యంతాలోచన చేతన
తెలిసి యీయగ్నీంద్రాదిపదోద్దేశ్యదేవతాకమఘాభిదముందఱ
క్రియలు పల్కెను; ఎవ్వం డెవ్వని నుద్దేశించి యేతద్ద్రవ్యంబు నిచ్చును
వాఁడు వానివలనఁ దద్ద్రవ్యత్యాగసదృశఫల మందు నన్యునివలన
లేదటన్న నుత్సర్గసయోవేదవాక్యంబు భూతిం బొందుపుచున్నయది
యని యీయజ్ఞంబునందు నాయికయైన యుద్దేశ్యదేవత యాగఫల
ప్రద యని లిఙ్మాదులు ధాత్వర్థకార్యంబుచేత దృఢాన్వయములై
లోకంబున వేదంబునఁ బరుని బోధించ క్షయములై ముఖ్యార్థసంకట
మైనప్పు డముఖ్యవృత్తిచేతన్యార్థవరంబు లగును; భావార్థపశ్య
కార్యత్వబోధనంబునందు సంకట మేమి కాలాంతరఫలప్రాప్తి
కొఱకై దేవత పూటయై కల్పింపఁబడియెను; తెలియంబడిన వహ్న్యాది
దేవతలు మాయచేత బంధంబు నొందె నాఫలప్రదానాస్వతంత్ర
లయ్యెనేని త్వదావేశంబున నాఫలంబు విను సమర్థు లౌచున్నయవి;
యంగవేదియైన పాణిని యజిధాతువును దేవపూజయందు విధించెను;
రాజపూజాఫలంబు రాజుంబలెను ప్రీతయైన దేవత యర్థికొఱకు
స్వపూజాఫల [3]మీయంగలదు; రాజపూజచేతఁ గాలాంతరఫలప్రదమైన
ధర్మంబు గలదా యని యన, లేదు; జనకాజ్ఞ స్వకీయులను రక్షింపఁ
గలయది యని స్మరించి యీప్రకారంబున నేకాలాంతరంబున
దేవుండు స్వసేవియైన యర్ధికొఱకు ఫలంబు నిచ్చును; కర్మమే
ఫలప్రదంబు గా; దట్లు కాకుండెనేని యరాజకదేశంబునందు స్వైరా
స్వైరవిహారులైనవారికి నాన్వైరాస్వైరవిహారంబులే దుఃఖకరంబు
లీవలయు నవి యిచ్చట భూమియందు లే దనియెడు నీయభిప్రా
యంబు గలదియై వేదాభిమానదేవత భవత్పూజారూపమైన కర్మ
మగ్రంబునం జెప్పెను; కర్మమే ఫలప్రదంబు గాదనియుం బలికెను;
దేవతయై కర్మఫలప్రద గాదనియును బలికెను; వైపరీత్యంబునఁ గర్మ
కాండమె దేవత నొకానొకదిక్కున నాదేవతయె ఫలప్రద యని
చెప్పును; తద్దేవతోక్తమైన వేదాభిమానదేవతాభిప్రాయంబు తండ్రి
వలన విని శుకుం డిట్లనియె.

49
  1. యంటే
  2. మవు
  3. మియ్యంగలదు